Sunday, April 28, 2024
- Advertisement -

ఆత్మ పరిశీలనలో గులాబీ దళం.. అదే కొంప ముంచిందా?

- Advertisement -

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పరాజయం ఎదురవడం పట్ల ఇప్పుడు ఆత్మపరిశీలనలో ఉన్నారు ఆ నేతలు. మొదట దుబ్బాకలో టీఆర్ఎస్ కు లక్ష ఓట్ల మెజారిటీ ఖాయం అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లకు కనీసం డిపాజిట్లు అయినా వస్తాయా అని వ్యాఖ్యానించారు.  కానీ నిన్న సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. మొదటి నుంచి అక్కడ బీజేపీ హవా కొనసాగిస్తూ వచ్చింది. ఎన్నికల సమయంలో దుబ్బాక ఉప న్నికల్లో గట్టి పోటీ ఉన్నా అధికార టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా రావడంతో రాజకీయ వర్గాలు పోస్ట్ మార్టం చేస్తున్నాయి.

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుందని అన్నారు.. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ సైతం  21,961 ఓట్లు సాధించింది. దీంతో టీఆర్ఎస్ ఓటమికి చాలా కారణాలు బయటపడుతున్నాయి.  కాగా, అభ్యర్థి ఎంపికపై అంసతృప్తి, మల్లన్నసాగర్ ముంపు గ్రామాల వ్యవహారం, శ్రుతిమించిన ఆత్మవిశ్వాసం టీఆర్‌ఎస్ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాల వల్ల భారీగా ఓట్లు పడతాయన్న గులాబీ నేతల అంచనాలు వేశారు.. అంతే కాదు సానుభూతి కూడా బాగానే వర్క్ ఔట్ అవుతుందని భావించారు.

ఇక మల్లన్న సాగర్ ముంపు గ్రామాల సమస్య కూడా టీఆర్ఎస్ ఆశలకు గండికొట్టింది. తక్కువ పరిహారం ఇచ్చారని బాధితులు ఆరోపించారు.  సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఎక్కవ పరిహారం ఇచ్చి, తమను నట్టేట ముంచారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు దీన్ని ఆయుధాలుగా వాడుకున్నాయి. ఇదే ఇప్పుడు దుబ్బాక ఎన్నికల ఫలితాలపై ప్రభావం బాగా చూపించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

దుబ్బాకలో ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తున్న : మంత్రి హరీష్

మ‌హేశ్‌ త్యాగం మరువలేనిది.. ప్రముఖుల నివాళి!

నేటి నుంచి రాష్ట్రమంతా… రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ.

వీర జవాన్‌ ప్రవీణ్ కుటుంబానికి రూ. 50 లక్షల ఆర్థిక సహాయం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -