Tuesday, April 30, 2024
- Advertisement -

టీఆర్ఎస్ కు 40 సీట్లు వస్తే ఎక్కువ

- Advertisement -

అసెంబ్లీ రద్దు చేసేసి, వెంటనే అభ్యర్ధులను ప్రకటించేసినంత మాత్రాన గెలుపు సాధ్యమా ? ప్రజల మనసులు గెలిచేసినట్టేనా ?

2014లో తెలంగాణ సాధించామన్న ఊపులోనే టీఆర్ఎస్ కేవలం 63 స్థానాల్లోనే గెలిచింది. తెలంగాణ జాతిపితగా వర్ణించుకున్నా… కేసీఆర్ 119సీట్లకు గానూ 63 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ సీపీ నుంచి గెలిచిన 27 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని బలాన్ని 90కి పెంచుకున్నారు. నాలుగేళ్ల పాలనలో ప్రభుత్వ వ్యతిరేకత సహజం. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ 40 అసెంబ్లీ సీట్లు గెలిస్తే గొప్పే. టీఆర్ఎస్ ఓటమి తప్పదని చెప్పేందుకు ప్రధానంగా 4 కారణాలు కనిపిస్తున్నాయి.

ఒకటి నిరుద్యోగులు
నాలుగేళ్ల పాలనలో కేసీఆర్ సర్కార్ కానిస్టేబులు ఉద్యోగాలకు తప్ప గ్రూప్ 1, గ్రూప్ 2, సహా ఏ ఇతర ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఒకే ఒక డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినా ఫుల్ ఫిల్ చేయకుండానే ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నారు. నీళ్లు, నియామకాలు, నిధులు అని చెప్పుకున్న గులాబీ నేతలు నియామకాలకు నీళ్లొదిలేశారు. కేసీఆర్ కుటుంబానికే నియామకాలు వచ్చాయి తప్ప నిరుద్యోగులకు రాలేదనే విమర్శలున్నాయి.

రెండు ప్రభుత్వ ఉద్యోగులు
ప్రభుత్వ ఉద్యోగులుకు పీఆర్సీ ప్రకటించలేదు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి కచ్చితంగా పెరిగిన ఖర్చులకు అనుగుణంగా పీఆర్సీ ఇవ్వాలి. అది ఇవ్వలేని స్థితిలో దాని స్థానంలో మధ్యంతర భృతి అయినా ఇవ్వాలి. కానీ ఆ రెండూ ఇవ్వకుండానే అసెంబ్లీని రద్దు చేశారు. జీతాలు 47 శాతం పెంచాడు. 47 శాతం పెంపు అంటూ ప్రభుత్వ ఉద్యోగులు అంటే భారీ జీతగాళ్లు..అని ప్రజల్లో తమను బదనాం చేశాడని వాళ్లు ఆగ్రహంతో ఉన్నారు. కానీ పీఆర్సీ లెక్క ప్రకారం తమకు రావాల్సినదాని కంటే తక్కువే ఇచ్చారని ఉద్యోగుల్లో నిరుత్సాహం ఉంది.

మూడు కులరాజకీయం
దశాబ్దాలుగా రాజకీయాలను శాసించిన రెడ్డిలు ఆటోమేటిక్ గా టీఆర్ఎస్ కు దూరం. కళ్లు దుకాణాల మీద ఆంక్షలతో, తమ వ్యాపారాలు పూర్తిగా దివాళా తీశాయని గౌడలు మండిపడుతున్నారు. తరతరాల తమ జీవనోపాధిపై దెబ్బకొట్టారని రగిలిపోతున్నారు. తమ పొట్టమీద కొట్టాడని ఆక్రోషం గౌడల్లో ఉంది. వీళ్లు ఓట్లు టీఆర్ఎస్ కు కష్టమే. గిరిజనులకు చేసిందేమీ లేదని అసంతృప్తి వుంది. ఎస్సీ వర్గీకరణకు సహకరించలేదని మందకృష్ణ మాదిగ సహా మాదిగ సామాజిక వర్గం మొత్తం దూరమయ్యారు. వాళ్ల ఓట్లు పడటమూ కష్టమే.

గ్రౌండ్ లెవల్లో కేడర్ సపోర్ట్ కష్టమే
దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది. మరోవైపు తెలంగాణ అంతటా సర్పంచ్ లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు నిధులు లేక పూర్తిగా దెబ్బతిన్నారని తెలుస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం తాము పెట్టిన పెట్టుబడి కూడా తెచ్చుకోలేని స్థితి. దీంతో పాటు ఓటర్ ను పోలింగ్ బూతుకు తీసుకువచ్చే కార్యకర్తలను టీఆర్ఎస్ పాలకులు పూర్తిగా విస్మరించారు. వారి ఆలనపాలనా పట్టించుకోకపోవడంతో వారూ గుర్రుగా ఉన్నారు. పై నాలుగు కారణాలు ప్రధానంగా టీఆర్ఎస్ గెలుపు అవకాశాలను దెబ్బకొట్టనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -