Thursday, May 9, 2024
- Advertisement -

మల్లారెడ్డి రాజకీయం.. బి‌ఆర్‌ఎస్ కు తలనొప్పే ?

- Advertisement -

టి‌ఆర్‌ఎస్ పార్టీ బి‌ఆర్‌ఎస్ గా మరి జాతీయ రాజకీయాల్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి పదిరోజులైనా గడవకముందే.. పార్టీలో అసమ్మతి సెగలు పురుడు పోసుకున్నాయి. మంత్రి మల్లారెడ్డిపై సొంత పార్టీ నుంచే పలువురు ఎమ్మేల్యేలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత చూపుతున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని నామినేటెడ్ పదవులన్నీ మంత్రి మల్లారెడ్డి అధీనంలో ఉండడంతో తమ సొంత నియోజిక వర్గాలలోని నేతలకు న్యాయం చేయలేకపోతున్నామని కొందరు ఎమ్మేల్యేలు మల్లారెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పారు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, నియోజికవర్గాల ఎమ్మెల్ల్యెలు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో బేటీ అయ్యారు.

అయితే గత కొన్నాళ్లుగా జిల్లాలోని కొంతమంది నేతలకు మంత్రి మల్లారెడ్డికి పొసగడం లేదనే వాదన కూడా ఉంది. మల్లారెడ్డి ఏకపక్ష దోరణీ వ్యవహరిస్తారనేది జిల్లాలోని కొందరు నేతలు చేస్తున్న ఆరోపణ.. కాగా మంత్రి వైఖరిపై అసమ్మతి ఎమ్మెల్యేలంతా కే‌టి‌ఆర్, మరియు కే‌సి‌ఆర్ దృష్టికి తీసుకెల్లే ఆలోచనలో కూడా ఉన్నారు. అయితే తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు.. ” ఇది మా పార్టీ కుటుంబ సమస్య అని.. దీన్ని మేమే పరిష్కరించుకుంటామని మల్లా రెడ్డి చెప్పుకొచ్చారు. తనకు ఎవరితోనూ విభేదాలు లేవని.. అందరం అన్నదమ్ముళ్ళ కలిసున్నామని, తన వల్ల ఏమైనా సమస్య ఉంటే అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేల ఇంటికెళ్ళి మాట్లాడతానని చెప్పుకొచ్చారు.

కాగా పదవులు ఇవ్వడంలో తన ప్రమేయం లేదని, పదవులు కే‌టి‌ఆర్, కే‌సి‌ఆర్ ఇస్తారని చెప్పుకొచ్చారు మల్లారెడ్డి. అయితే బి‌ఆర్‌ఎస్ లో కే‌సి‌ఆర్ అనుమతి లేనిదే చీమ కూడా చిటుక్కూ మనదు. అలాంటిది ఏకంగా అయిదుగురు ఎమ్మేల్యేలు ఏకంగా మంత్రిపై తిరుగుబాటు జెండా ఎగురవేస్తుంటే.. అది కే‌సి‌ఆర్ అనుమతి లేనిదే జరిగిందా ? అనే సందేహాలు కొందరు రాజకీయ వాదులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మద్య కాలంలో మల్లారెడ్డి చుట్టూ రాజుకున్న రాజకీయ వేడి అంతా ఇంతా కాదు.ఇంజనేరింగ్ మెడికల్ కాలేజీల్లో కోట్ల రూపాయల పేరుతో డొనేషన్లు తీసుకున్నారని మల్లారెడ్డిపై ఈటీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ ఐటీ సోదాలు ఆ మద్య తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి కూడా విధితమే. అలాగే మల్లారెడ్డి దురుసు మాట విధానం కూడా బి‌ఆర్‌ఎస్ కు తలనొప్పులు తెచ్చిపెడుతోందనేది ఇంటర్నల్ గా వినిపిస్తున్న మాట. అందుకే మల్లారెడ్డి వైఖరి పట్ల కే‌సి‌ఆర్ అసహనంగా ఉన్నారని, అందువల్ల వ్యతిరేకంగా సొంత జిల్లాలోని ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయిస్తున్నారనే వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికి ఓ వైపు బి‌ఆర్‌ఎస్ దేశ వ్యాప్తంగా విస్తరిస్తుంటే.. మరోవైపు సొంత పార్టీలోని మల్లారెడ్డి రాజకీయం హాట్ హాట్ డిబేట్లకు కారణం అవుతోంది. మరి దీనిపై కే‌టి‌ఆర్, కే‌సి‌ఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

ఇవి కూడా చదవండి

బీజేపీ మిషన్ 90.. అధికారమే లక్ష్యంగా !

పద్మవ్యూహంలో చిక్కునున్న రేవంత్.. బయటపడేదెప్పుడూ ?

ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్.. ఈసారి వినకపోతే అంతే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -