Sunday, April 28, 2024
- Advertisement -

ఏపీపై మోడీకి నమ్మకం లేదా..అసలెందుకు ?

- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 11,12 తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తరువాత ప్రధాని రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటించడంతో ఆయన పర్యటనపై రాజకీయ వేడి కాస్త గట్టిగానే కొనసాగింది. మోడీ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు ? ఏ ఏ అంశాలను ప్రస్తావిస్తారు అనే ప్రశ్నలపై పోలిటికల్ సర్కిల్స్ లో గట్టిగానే చర్చ జరిగింది. అయితే మోడీ మాత్రం ఏపీ లో ఒకలా తెలంగాణలో మరోలా ప్రసంగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఏపీలో కామ్ అండ్ కంపోజ్ గా వ్యాఖ్యలు చేసిన మోడీ.. తెలంగాణ వచ్చే సరికి టి‌ఆర్‌ఎస్ సర్కార్ పై పరోక్షంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే మోడీ తెలంగాణపై ఆ స్థాయిలో విరుచుకుపడడానికి కారణం కూడా లేకపోలేదు. .

కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టడం, తరచూ మోడీ టార్గెట్ గానే గులాబీ బాస్ వ్యూహాలు రచిస్తూ ఉండడం అలాగే తెలంగాణలో బీజేపీ బలపడుతుండడంతో మోడీ కాస్త గట్టిగానే అగ్రెసివ్ స్పీచ్ ఇచ్చారు. కానీ ఏపీ విషయానికొస్తే.. ఏదో నామమాత్రపు ప్రసంగంతో చుట్టేశారు. విశాఖపట్నం అద్బుతమైన నగరమని, ఏపీ ప్రజలు ఎంతో ప్రతిభావంతులని, ఇలా కొన్ని మాటలు చెబుతూ సోసో గా ముగించారు. దీంతో మోడీ తెలంగాణలో అలా ఎందుకు ? ఏపీ లో ఇలా ఎందుకు ? అనే చర్చ రాజకీయ వర్గాల్లో గట్టిగానే జరుగుతోంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ రైజింగ్ పార్టీగా ఉంది. వచ్చే ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్ కు ధీటైన ప్రత్యర్థి పార్టీగా బీజేపీ నిలవనుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు, ప్రజల్లో పార్టీకి మరింత బూస్టప్ తీసుకోచ్చేందుకే మోడీ కే‌సి‌ఆర్ ప్రభుత్వం పై ఉవ్వెత్తున ఎగసిపడ్డారు.

కానీ ఏపీలో పరిస్థితి అలా లేదు. అసలు ఏపీలో బీజేపీని రేస్ లో కూడా కన్సిడర్ చేయడం లేదు ఏపీ ప్రజలు. ఒకవేళ జనసేనతో పొత్తు లేకపోతే..ఆ పార్టీ ఉందనే విషయం కూడా చాలమంది మరిచిపోతారు. ఈ నేపథ్యంలో ప్రధాని ఎన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసిన ఏపీలో బీజేపీకి బలం చేకూరే అవకాశమే లేదు. అందువల్లే మోడీ ఏపీ పై పెద్దగా దృష్టి సారించలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఏపీలో బీజేపీ ప్రభావం పెద్దగా లేనందువల్ల.. టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీల అవసరత భవిష్యత్ లో గట్టిగానే ఉండే అవకాశం ఉంది. అందుకే జనసేనతో జనసేనతో పొత్తు కొనసాగిస్తూనే.. టీడీపీ, వైసీపీ లతో సమ దూరం కొనసాగిస్తోంది బీజేపీ. అందుకే మోడీ విశాఖ పర్యటనలో పెద్దగా ప్రభావితం చూపే వ్యాఖ్యలు చేయలేదని కొందరి మాట. మరి భవిష్యత్ లో తెలంగాణ మాదిరగానే ఏపీలో కూడా బీజేపీ బలపడుతుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

హ్యాపీ చిల్డ్రన్స్ డే.. లోకేష్ !

అవంతి “బంగారం “.. ఎప్పుడు ఇదే పనేనా?

ఒక్క ఛాన్స్ అంటున్న పవన్.. జగన్ కు ఇబ్బందే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -