Tuesday, April 30, 2024
- Advertisement -

సిట్టింగ్‌ల గుండెల్లో గుబులు పెట్టిస్తున్న కేసీఆర్ సీక్రెట్ సర్వే

- Advertisement -

గులాబీ అధినేతను ఓ వెలతి వెంటాడుతోందట. ఎవరెన్ని రకాలుగా సర్వేలు నిర్వహించి నివేధికలు ఇస్తున్నా సాటిస్పైడ్ కావడం లేదట. అందుకే సొంతంగా తన టీమ్‌నే రంగంలోకి దించారట. 119 నియోజకవర్గాలను చుట్టి రమ్మని పంపిస్తున్నారట. మూడో కంటికి తెలియకుండా తన ఆదేశాలను అమలు చేసే బ్యాచ్‌ను ఎంపిక చేసుకున్న అధినేత.. వారితో తనకు కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తున్నారట. అత్యంత రహస్యంగా ఈ సర్వే నిర్వహిస్తున్నారన్న వార్త బయటకు రావడంతో సిట్టింగ్‌లకు వణుకు మొదలైందట. అధినేత చేస్తున్న వడపోతును తలుచుకొని దిగాలు పడుతున్నారట. ఉన్న ఫలంగా గులాబీ బాస్ ఈ గుట్టు సర్వేను ఎందుకు చేయించారు..? తేడా ఎక్కడో కొట్టొచ్చినట్లు కన్పిస్తుందా..? అధినేత సర్వేతో ఎవరికి భయం, ఎవరికి అభయం?

21 ప్రశ్నలు, 25 మంది ఎమ్మెల్యేలు. అంతలా వణికిపోతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు ? బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తోన్న ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ సర్వే టెన్షన్ పట్టుకుంది. ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ నిర్వహించనున్న మరో సర్వేతో 25 మంది ఎమ్మెల్యేలు వణికిపోతున్నారట. 21 ప్రశ్నలతో ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారట.. ఒకపక్క ప్రతిపక్షాలు పాదయాత్ర పేరుతో ప్రజా క్షేత్రానికి దూకుపోతుంటే.. తానేమి తక్కువ కాదంటూ నాలుగడుగులు మూందే వేసి క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సర్వేల రూపంలో ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారట. ఇప్పటికే సిట్టుంగు లందరికీ టికెట్లు ఇస్తానని చెప్పారు గులాబి దళపతి. ఈ నేపథ్యంలోనే సిట్టింగు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి ? నియోజకవర్గంలో వారికున్న ప్రజాభలం ఎంత ? ఈ సారి కూడా టికెట్ ఇస్తే విజయం సాధించే అవకాశం ఉందా ? పార్టీలో ఆశావాహులు ఎవరు ? వారిలో ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు. ? అదే సమయంలో అదే నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీలో బలమైన నాయకులు ఏవరు ? ఒకవేళ గాలం వేసి వారికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఎంత వరకు ఉంది. ? వారిని ఎన్నికల ముందే చేర్చుకోవాలా ? లేదంటే పరోక్షంగా మద్దతు ఇచ్చి ఎన్నికల తర్వాత పార్టీలోకి చేర్చుకోవాలా ? ఇలాంటి అంశాలపైనే ప్రజాభిప్రాయాలను తీసుకొని వాటిని గ్రాంట్ చేసి స్టాటజీలను రచించాలని అనుకుంటున్నారట.

మరోవైపు బీఆర్ఎస్‌కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదనే టాక్ వినిసిస్తోంది. వారిని మార్చితే మళ్లీ అధికారం బీఆర్ఎస్ పార్టీదేనని గతంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓపెన్‌ గానే కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మరోసారి గెలవలేని ఎమ్మెల్యేలపై ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట. అందుకే తన టీంతో తానే ఓ సర్వే నిర్వహించాలని అనేకుంటున్నారట. దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు తాజా సర్వేతో ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. టికెట్ల విషయంలో మల్లగుళ్లాలు పడుతున్న ఎమ్మెల్యేలు.. అధినేత అన్న మాట ప్రకారం మళ్లీ టికెట్ ఇస్తారా ? లేక ఇబ్బంది పెడుతారా అంటూ తెలిసిన వారి దగ్గర ఆరా తీస్తున్నారట.

ఇలా సోంత పార్టీ నేతలను కంగారు పెట్టిస్తున్న అధినేత తన టేబుల్ మీదకు చేరిన బ్లాక్ లీస్టును ఫిల్టర్ చేస్తున్నారట. సర్వే ద్వారా పనితీరుపై ఓ అంచనాకు వస్తున్న అధినేత కొందరు సిట్టింగ్‌లకు చెక్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చారట. ఎన్నికల సమయం వచ్చే సరికి ఈ విషయాన్ని క్లారిగా చెప్పేసి బాబూ మీ పని మీరు చూసుకొండని క్లారిటీ ఇవ్వబోతున్నారట. ఇదంతా కేసీఆర్ ఎందుకు చేస్తున్నారంటే.. నియోజకవర్గాల పెంపుపై ఆశలు గల్లంతవ్వడం, ఇతర పార్టీల నేతలు పెద్ద ఎత్తున వచ్చి చేరడంతో వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశించే జాబితా పెరిగిపోయింది. దీనిని అధిగమించాలంటే పాత వారిని అధిగమించాలా.. లేక కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలా.. అనే ధానిపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన గులాబీ అధినేత వడపోత కార్యక్రమం మొదలు పెట్టారన్న చర్చ జరుగుతోంది.

ఓ పక్క అధినేత సర్వే లెక్కలు ఈ విధంగా ఉంటే.. పార్టీలోని ప్రత్యర్థులు ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారం పార్టీలోని సిట్టింగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందట. వచ్చే ఎన్నికల కసరత్తులో భాగంగా సీఎం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించాలని అనుకుంటున్నారట. ఎవరి మీదా నమ్మకం పెట్టుకోని కేసీఆర్ తనకు తానే సొంతంగా మరో సర్వే జరుపుతున్నారట. ఏమైనా సిట్టింగులందరికీ సీట్లు దక్కడం అనుమానమే అనే టాక్ బలంగా ప్రచారంలోకి రావడంతో సిట్టింగులను తిండికి, నిద్రకు దూరం చేస్తోందట. మరి సర్వే సారాంశం ఎలా పని చేస్తోందో.. ఆ నివేధికలో ఏముందో అధినేత ఆలోచన ఏంటో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -