Wednesday, May 8, 2024
- Advertisement -

బీఎస్పీ ఎఫెక్ట్…కాంగ్రెస్‌లోకి కోనేరు!

- Advertisement -

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. అధికారం కొల్పోవడంతో ఒక్కొక్కరుగా నేతలు పార్టీని వీడుతున్నారు. ఇక బీఆర్ఎస్ టికెట్‌పై పోటీకి వెనుకంజ వేస్తున్నారు కొంతమంది సిట్టింగ్ ఎంపీలు, సీనియర్ నేతలు. ఇక మరికొంతమంది ఇప్పటికే పార్టీ మారి సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోతున్నారు.

తాజాగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్…బీఎస్పీతో పొత్తును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పొత్తు నేపథ్యంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు కొమురం భీం జిల్లా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుండి బీఎస్పీ చీఫ్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. వీరిద్దరి పోటీలో బీజేపీ గెలిచింది.

దీంతో కోనేరు ఓడిపోవడానికి ఆర్‌ఎస్పీనే కారణమని ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో బీఎస్పీతో కేసీఆర్ పొత్తు ప్రకటించడంపై రగిలిపోతున్న కోనప్ప..కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు.ఇప్పటికే సీఎం రేవంత్ ని కలిసి పార్టీలో చేరికకు సుముఖత వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరనుండగా తన వెంట జడ్పీ చైర్మన్, ఆరుగురు ఎంపీపీలు, ఐదుగురు జడ్పీటీసీలు, ఒక మున్సిపల్ చైర్‌పర్సన్ , 24 మంది కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, వందకు పైగా మాజీ సర్పంచ్ లను తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే సిర్పూర్‌లో పార్టీకి గట్టి దెబ్బ తగలడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -