Thursday, May 2, 2024
- Advertisement -

ప్ర‌త్యేక‌హోదాపై మెగా స్పంద‌న‌…

- Advertisement -

ప్ర‌త్యేక‌హోదాపై రాష్ట్ర‌రాజ‌కీయాలు అట్ట‌డుకుతున్నాయి. అన్ని పార్టీలు ఏదొక రూపంలో త‌మ పోరాటాల‌ను ఉదృతం చేస్తున్నాయి. వైసీపీ త‌మ ఎంపీలచేత రాజీనామా చేయించిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో ఇంత జ‌రుగుతున్నా కాంగ్రెస్ సీనియ‌ర్‌నేత చిరంజీవి మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు స్పందించిన దాఖ‌లాలు లేవు.

గ‌త కొంత కాలంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు చిరంజీది దూరంగా ఉన్నారు. రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ముగిసినా చిరు సిన‌మాల‌పైనే దృష్టిసారించారు. ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో మోదీ ప్ర‌భుత్వం మోసం చేసింద‌ని రాష్ట్ర‌వ్యాప్తంగా ధ‌ర‌న్నాలు, నిర‌స‌న‌లు, రైల్‌రోకోలు జ‌రుగుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు చిరంజీది స్పందించిన దాఖ‌లాలు లేవు.

రాష్ట్ర‌విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రేస్‌కు ఏగ‌తి ప‌ట్టిందో అంద‌రికీ తెలిసిందే. అప్ప‌టినుంచి చిరంజీవి పార్టీ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన‌లేదు.అయితే ప్ర‌త్యేక హోదాపై తాజాగాస్పందించారు మెగాస్టార్‌. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పటికైనా ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు.

పనిచేసేవారికి కాంగ్రెసు పార్టీలో ఎప్పుడూ మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పారు. అఖిల భారత కాంగ్రెసు కమిటీ కార్యదర్శిగా, ఒడిశా రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీగా నియమితులైన గిడుగు రుద్రరాజు శనివారం చిరందజీవిని కలిశారు.

ప్రత్యేక హోదాపై పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు ఆందోళనకు దిగినప్పటికీ, రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగుతున్నప్పటికీ చిరంజీవి మౌనంగానే ఉండిపోయారు. ఆయన మౌనంపై కొద్ది మంది ప్రశ్నలు కూడా వేశారు. చిరు ఇప్పుడు స్పందించ‌డం కొస‌మెరుపు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -