Friday, May 3, 2024
- Advertisement -

BREAKING : మంత్రి కేటీఆర్ కి కరోనా

- Advertisement -

గత ఏడాది నుంచి ప్రపంచాన్ని మొత్తం కరోనా కుదిపేస్తుంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా కుదేలు చేస్తుంది. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు కరోనా కాటుకు బలి అవుతూ వస్తున్నారు.

ఇటీవల సాగర్ ఉప ఎన్నికల పోరులో పాల్గొన్న వారందరికీ కరోనా వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నీ కరోనా వదల్లేదు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ కి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే.. ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.

కరోనా లక్షణాలు కాస్త తనకు ఉన్నాయని, ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాను.. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. తనను ఈ మధ్య కలిసిన నేతలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎంపీ సంతోష్ కుమార్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే. అటు టీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులు కరోనా బారిన పడటంతో నేతల్లోనూ ఆందోళన మొదలైంది.

నేటి పంచాంగం, శుక్రవారం (23-04-2021)

పెళ్లి చేసుకొని ఒక్కటైన గుత్తా జ్వాల, విష్ణు విశాల్!

‘జాతిరత్నాలు’ సీక్వెల్ రాబోతుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -