Thursday, May 2, 2024
- Advertisement -

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు లెక్కింపు ప్రారంభం…!

- Advertisement -

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది. నగరంలోని సరూర్‌నగర్‌లో ఉన్న ఇండోర్‌ స్టేడియంలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాం హాళ్లలో నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల స్థానాల ఓట్లను లెక్కిస్తున్నారు.  రాత్రి 8 గంటల వరకు బ్యాలెట్​ పేపర్లను కట్టలు కట్టనున్నారు. 25 బ్యాలెట్‌ పత్రాల చొప్పున కట్టలు కట్టనున్నారు. ఇవాళ రాత్రి 9.30 తర్వాత తొలి రౌండ్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

పెరిగిన పోలింగ్​తో పాటు జంబో బ్యాలెట్​తో కౌంటింగ్​ సవాల్​గా మారింది. దీంతో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు రెండ్రోజులు పట్టే అవకాశం ఉంది. 3 షిఫ్టుల్లో ఓట్లు లెక్కించనున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం కౌంటింగ్‌ కేంద్రాల్లో విస్తృత ఏర్పాట్లు చేసింది. ఒక్కో హాల్‌లో 7టేబుళ్ల చొప్పున మొత్తం 56 టేబుళ్లు ఏర్పాటు చేసింది.

టేబుల్‌కు 1000 చొప్పున ఏకకాలంలో 56 వేల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాత్రి 8 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రాత్రి 9.30 గంటల తర్వాతే తొలి రౌండ్‌ పూర్తయ్యే అవకాశం ఉన్నది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపు తేలకుంటే ఎలిమినేషన్‌ ప్రక్రియ చేపడుతారు.

న్యూ లుక్ తో అల్లు అర్జున్..!

ముఖానికి నిమ్మరసం మంచిదేనా

గుండె సమస్యలకు ఈ మూడే కారణాలట..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -