Tuesday, April 30, 2024
- Advertisement -

మోడీ అమిత్ షా లను చెంప మీద కొట్టిన మునుగోడు ఓటర్లు !

- Advertisement -

మునుగోడు బైపోల్ సమరం ఎట్టకేలకు ముగిసింది. గత కొన్ని రోజులుగా కొనసాగిన రచ్చ కు తెరదించుతూ.. టి‌ఆర్‌ఎస్ మునుగోడులో పాగా వేసింది. టి‌ఆర్‌ఎస్ కు ఈ విజయం చిరస్మరణీయం అనే చెప్పవచ్చు. మునుగోడు టి‌ఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానం కానప్పటికి, విజయ ఢంఖా మోగించింది. ముంఖ్యంగా మునుగోడులో టి‌ఆర్‌ఎస్ విజయం బీజేపీకి ఏమాత్రం మింగుడు పడని విషయమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మునుగోడులో బలమైన నేతగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఉండడంతో మునుగోడులో బీజేపీ విజయం నల్లేరు మీద నడక అని భావించారు కమలనాథులు. మొదటి నుంచి కూడా తమదే విజయం అనట్లుగా ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ జాతీయ నేతలు మొదలుకొని, తెలంగాణ రాష్ట్ర నాయకుల వరకు అందరూ కూడా మునుగోడు చుట్టే తిరిగారు. ఒక విధంగా చెప్పాలంటే అధికార టి‌ఆర్‌ఎస్ పార్టీ కన్నా బీజేపీనే దూకుడుగా వ్యవహరిస్తూ.. మునుగోడులో ప్రచారం సాగించింది. తీరా ఫలితాలు మాత్రం బెడిసికొట్టాయి. కమలనాథుల అంచనాలు తలకిందుకు చేస్తూ మునుగోడు ఓటర్లు టి‌ఆర్‌ఎస్ కే పట్టం కట్టారు. దీంతో కాషాయ దళం గొంతు మూగబోతే..గులాభి దండు విజయాన్ని ఆస్వాదిస్తున్నాయి. ఇక మునుగోడు విజయంతో టి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ మంత్రి కే‌టి‌ఆర్ మరోసారి తనదైన రీతిలో పలు ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు.

హుజూర్ నగర్, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికలలో టి‌ఆర్‌ఎస్ ను గెలిపించి మొత్తం నల్గొండ జిల్లాలోనే 12 నియోజిక వర్గాలను టి‌ఆర్‌ఎస్ కు కట్టబెట్టినందుకు నల్గొండ వాసులకు కే‌సి‌ఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఒక జిల్లాలోని అన్నీ నియోజిక వర్గాలను ఒకే పార్టీ కైవసం చేసుకోవడం చరిత్రలో తొలిసారి అంటూ కే‌టి‌ఆర్ చెప్పుకొచ్చారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీదారుడైనప్పటికి.. అతని వెనుక ఉండి నడిపించింది మాత్రం మోడీ, అమిత్ షా లు అంటూ కే‌టి‌ఆర్ అన్నారు. మునుగోడులో టి‌ఆర్‌ఎస్ విజయం మోడీ, అమిత్ షా లకు గట్టి చెంపపెట్టు అంటూ విమర్శించారు. ఏది ఏమైనప్పటికి మునుగోడు విజయం టి‌ఆర్‌ఎస్ లో జోష్ నింపితే.. బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

మూవీ పాలిటిక్స్.. ఇదే గురూ మన ట్రెండు !

ఫామ్ హౌస్ ఫైల్స్ : కే‌సి‌ఆర్ డైరెక్షన్.. బీజేపీ యాక్షన్ !

జగన్ కు తలనొప్పిగా మారుతున్న బొత్స !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -