Thursday, May 2, 2024
- Advertisement -

తెలంగాణలో మోడి టూర్.. కే‌సి‌ఆర్ హాండ్ ఇస్తారా ? షేకండ్ ఇస్తారా ?

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై గట్టిగా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. టి‌ఆర్‌ఎస్ పార్టీని అధికారికంగా పేరు మార్చి జాతీయ పార్టీగా దసరా రోజు అనౌన్స్ చేశారు కే‌సి‌ఆర్. ఇక ఆయన జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టినది మొదలుకొని.. కేంద్రంలోని మోడీ పరిపాలనపై ఉవ్వెత్తున విమర్శలు చేస్తున్నారు. మోడీ పాలనలో దేశాభివృద్ది కుంటు పడుతోందని, మతవిద్వేషాలు పెరుగుతున్నాయని నానా రకాలుగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు కే‌సి‌ఆర్. దాంతో మోడి టార్గెట్ గానే కే‌సి‌ఆర్ వ్యూహాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా అర్థమౌతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ తెలంగాణ టూర్ ఆసక్తికరంగా మారింది. నవంబర్ 12 వ తారీఖున మోడి తెలంగాణకు రానున్నారు.

రమగుండం ఎరువుల ఫ్యాక్టరీని అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు మోడి. అయితే ఈ ఫ్యాక్టరీ ఇప్పటికే ప్రారంభం అయింది. వాణిజ్య ఉత్పత్తులు కూడా జరుగుతున్నాయి. ఇక మోడి తెలంగాణ టూర్ తో సి‌ఎం కే‌సి‌ఆర్ వైఖరి ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని మోడితో పాటు కే‌సి‌ఆర్ కూడా ఫ్యాక్టరీ ప్రారంబొత్సవంలో పాల్గొంటారా ? ఒకవేళ పాల్గొంటే అక్కడ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనే దానిపై పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ డిబేట్లు నడుస్తున్నాయి.

ఎందుకంటే ఫ్యాక్టరీ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా కొంత భాగం ఉంది. ఈ నేపథ్యంలో మోడీ తో పాటు కే‌సి‌ఆర్ కూడా పాల్గొనే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామల దృష్ట్యా ప్రధాని తో పాటు కే‌సి‌ఆర్ హాజరు కారనే వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. మరి మోడీ తెలంగాణ టూర్ లో సి‌ఎం కే‌సి‌ఆర్ హ్యాండ్ ఇస్తారా ? లేదా షేకండ్ ఇస్తారా ? అనేది తెలియాలంటే నవంబర్ 12 వరకు ఎదురుచూడాలి.

ఇవి కూడా చదవండి

కుప్పంలో అరాచకం ఎవరిది.. చంద్రబాబు దా ? జగన్ దా ?

అందరి చూపు జనసేన వైపు.. పవన్ ప్లానెంటి ?

జగన్ కు బీసీలపై ప్రేమ ఎందుకు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -