Thursday, May 2, 2024
- Advertisement -

రాహుల్ , ప్రియాంక గాంధీ హత్రాస్ లో రాజకీయం చేశారా..?

- Advertisement -

దేశంలో హత్రాస్ సంఘటన రాజకీయ ప్రకంపనలకు వేదిక గా మారుతుంది.. గతంలో జరిగిన నిర్భయ ఘటన కంటే ఈ హత్రాస్ సంఘటన సంచలనంగా మారుతోంది. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయంగా మార్చుకొని బలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తూనే బాధితురాలికి న్యాయం చేయాలనీ పోరాటం చేస్తున్నారు.. గతంలో ఢిల్లీ లో జరిగిన నిర్భయ ఘటన పై ప్రతిపక్షాలు ఇదే విధంగా నిరసనలు చేపట్టాయి.. అయితే అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అందరి తో పాటు అధికార పార్టీ ఈ ఘటన పై చాలా ఆగ్రహంగా వ్యవహరించింది.. అయితే ఇప్పుడు హత్రాస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహారం కొంత తేడా గా ఉంది.. బీజేపీ పార్టీ ఈ వ్యవహారాన్ని పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది..

ఆ ఘటనను వీలైనంతగా లో ప్రోఫైల్‌గా మార్చేసి.. ప్రతిపక్షాల పోరాటాలన్ని వీలైనంతగా తొక్కేస్ ప్రయత్నం చేస్తోంది.అయితే రాజకీయాల్లో ఎంతగా అణిచివేస్తే.. ఆ వ్యవహారం అంతగా పెరిగిపోతుంది. ఇప్పుడు హత్రాస్ వ్యవహారంలో అదే జరుగుతోంది.  కుటుంబసభ్యుల చివరి చూపునకు కూడా నోచుకోకుండా చేసి ఆమెకు దహనసంస్కారాలు చేసేశారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడే ప్రభుత్వం దోషిగా దొరికిపోయింది.ఆ తర్వాత తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళింది. బాధిత కుటుంబ సభ్యులను ఎవరు పరామర్శించొద్దు అన్నట్లు వాతావరణం సృష్టించారు. రాహుల్ , ప్రియాంక లను కూడా రోడ్డు మీదే నిలబెట్టేశారు..

కానీ చివరికి కలుసుకోగలిగారు. అయితే సినీ ఫక్కీ లో ఎంతో పకడ్బందీగా వీరు వారిని కలుసుకోగలిగారు.. అప్పటి వరకూ బిగబట్టుకున్న వారి కన్నీళ్లు.. రాహుల్, ప్రియాంకల ఓదార్పు తర్వాత ఒక్క సారిగా ఉబికి వచ్చాయి. వారు ఈ ఘటన తర్వాత ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి ఎలా ఉందో ఆ కన్నీళ్లు నిరూపించాయి. ఒకరు డబ్బుతో సెటిల్ చేశామంటారు.. మరొకరు రేప్ జరగలేదని వాదిస్తారు. ఇలా.. ఎన్నో.. ఎన్నో వికారాల మధ్య అన్యాయమైపోతున్న హత్యాచార బాధితురాలి కుటుంబానికి రాహుల్, ప్రియాంక అండగా నిలిచారు. అయితే అధికారపార్టీ దీన్ని రాజకీయం గా చిత్రీకరించబోయింది.. కానీ ఈ విషయంలో ప్రజల మద్దతు రాహుల్ కే ఉంది అని తెలుస్తుంది..  వారు అలా పరామర్శించారు కాబట్టే ఈ విషయం ఇప్పుడు ఇంతలా ఉద్యమంలా తయారయింది.. మరి అధికార ప్రభుత్వం ఈ నిందితులని నిర్భయ ఘటన మాదిరి కఠినంగా శిక్షిస్తారా అనేది చూడాలి.. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -