Wednesday, May 1, 2024
- Advertisement -

వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ…

- Advertisement -

ప్ర‌కాశం జిల్లాలో టీడీపీకీ బిగ్‌షాక్ త‌గ‌ల‌నుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ పార్టీకి అత్యంత విధేయుడు, సీనియ‌ర్‌నేత వైసీపీలోకి వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారంట‌. పార్టీలో బలీయమైన నాయకుడు అయిన కరణం బలరాం వైసీపీలో చేరనున్నారనే వార్తలు తరచుగా వస్తూనే ఉన్నాయి.

గత ఎన్నికల్లో అద్దంకి నియోజక వర్గంలో టీడీపీ తరపున పోటీచేసిన బలరాంపై వైసీపీ తరుపున గొట్టిపాటి గెలిచారు. ఆ త‌ర్వాత ర‌వి టీడీపీలో చేర‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. చంద్ర‌బాబు ఇద్ద‌రి మ‌ధ్య రాజీ కుదిర్చేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌లం అయ్యాయి.

ప్ర‌స్తుతం క‌ర‌నంను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు నేత‌లు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఈ క్రమంలో బలరాం కొడుకు వెంకటేష్‌కి కూడా టికెట్ ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చిందట. దీంతో బలరాంకు 2019లో టీడీపీలో సీటు ఇచ్చే అవకాశం లేకపోవడం, గోట్టిపాటిదే సీటు అని ఆయన వర్గం ప్రచారం చేసుకోవడంతో బలరాం వైసీపీలోకి వస్తారని ఏడాది క్రితమే ఫిక్స్ అయిపోయింది.

గొట్టిపాటి, క‌ర‌ణం వ‌ర్గాల మ‌ధ్య పోరు ముదిరి పాకాన ప‌డినా ఈ వివాదాన్ని ప‌రిష్కరించి రెండు క‌త్తుల‌ను ఒకే ఒర‌లో ఇమ‌డ్చేందుకు సీఎం చంద్రబాబు కనీసం గట్టి ప్రయ‌త్నాలు చేయకపోవడం కరణం వర్గాన్ని బాధిస్తోందట. గొట్టిపాటి టీడీపీలో చేరిన ద‌గ్గర బలరాం బాగానే ఉంటున్నా ద్వితియ శ్రేణి న్యాయకత్వానికి ఇబ్బందులు కలుగుతున్నాయట.. తామంతా కరణం ఓకే అంటే వైసీపీలోకి వెళ్లిపోవాల‌ని భావిస్తున్నార‌ట‌. అంతేగాక వైసీపీ పార్టీ నేత‌ల‌తో కూడా ట‌చ్ లో ఉంటున్నార‌ట‌.

దీంతో వైసీపీలోకి మారతారని స్పష్టమైన సంకేతాలు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఆయనకు అద్దంకి వెంకటేష్ కు జిల్లాలోని మరో నియోజకవర్గం లేదా జిల్లా స్థాయి పదవితో మళ్లీ దూసుకెళ్లాలని కరణం వర్గం భావిస్తోంది. అయితే ఇటీవల జగన్ బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో బలరాం కలిసిన ఫొటో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండడతో బలరాం చేరిక వార్తలకు బలం చేకూరుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -