Friday, May 3, 2024
- Advertisement -

వాలెంటీర్ల వ్యవస్థ.. రాజ్యాంగానికి వ్యతిరేకమా ?

- Advertisement -

జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన వాలెంటీర్ల వ్యవస్థపై ప్రశంశలు ఏ స్థాయిలో వినిపిస్తున్నాయో విమర్శలు కూడా అంతే స్థాయిలో వినిపిస్తూ ఉంటాయి. దేశంలో ఎక్కడ లేని విధంగా వాలెంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టి ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత దగ్గర చేశారు ఏపీ సి‌ఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ పథకాలు ప్రజలకు పారదర్శికంగా చేరేలా చూడడం వాలెంటిర్ల ప్రధాన భాద్యత. అయితే వాలెంటిర్లను పార్టీ కార్యకలాపాలలో కూడా వినియోగించుకుంటున్నారని జగన్ సర్కార్ పై విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక రాబోయే ఎన్నికల్లో కూడా వాలెంటిర్లను పార్టీకి అనుకూలంగా వినియోగించుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. .

మరి ఎన్నికల పనుల్లో వాలెంటిర్లకు ఈసీ అనుమతి ఇస్తుందో లేదో అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది.. ఇదిలా ఉంచితే తాజాగా కేంద్ర సహాయకమంత్రి దేవ్ సింగ్ చౌహాన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ సర్కార్ ప్రవేశ పెట్టిన వాలెంటరీ వ్యవస్థ రాజ్యాంగ వ్యతిరేకం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రనికి సుపరిపాలన అందించడంలో జగన్ సర్కార్ విఫలం అయిందని కర్నూల్ పర్యటనలో భాగంగా ఆయన ద్వజమెత్తారు. కేంద్రం ఇచ్చే నిధులను పేరు మార్చి రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోందని ఆయన అన్నారు.

ఇలా ఆయా పార్టీల నేతలు వాలెంటరీ వ్యవస్థపై సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో అన్నీ జిల్లాలలోనూ బలంగా ఉన్న వాలెంటరీ వ్యవస్థ.. ప్రభుత్వ పథకాలను పాక్కగా ప్రజలకు చేరవేస్తోంది. అయితే వాలెంటిర్లలో కొంతమంది కమిషన్ల రూపంలో లభ్దిదారులను వేధిస్తుండడంతో మెల్లమెల్లగా ప్రజల్లో కూడా వాలెంటిర్లపై వ్యతిరేకత మొదలైంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వానికి ప్లేస్ అవుతుందనుకున్న వాలెంటరీ వ్యవస్థ.. అనేక విమర్శలు వ్యతిరేకత మూటగట్టుకుంటూ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పిగా మారే అవకాశం ఉందని కొందరి అభిప్రాయం.

ఇవి కూడా చదవండి

కే‌సి‌ఆర్ మాస్టర్ ప్లాన్.. సిద్దమైన బీజేపీ ?

తెలంగాణపై జనసేన గురి.. !

చిక్కుల్లో బీజేపీ.. జనసేన ప్రభావమే

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -