Monday, April 29, 2024
- Advertisement -

కాంగ్రెస్ ఘోర ఓటమి.. బాధ్యత ఎవరిది ?

- Advertisement -

మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చవిచూసింది. చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక మునుగోడు బైఎలక్షన్స్ లో చేతులెత్తేసింది. మరి కాంగ్రెస్ కంచుకోటగా భావించే మునుగోడులో కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవడం ఆ పార్టీకి కోలుకోలేని షాక్ అనే చెప్పాలి. ఇంతకీ డిపాజిట్ అనగా మొత్తం పోలైన ఓట్లలో 1/6 వంతు ఓట్లు వస్తే డిపాజిట్ దక్కినట్లుగా ప్రకటిస్తారు. మునుగోడు బైపోల్ లో మొత్తం 2,25,192 ఓట్లు పోలవ్వగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డికి కేవలం 21 వేల పైచిలుకు ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో కాంగ్రెస్ కు డిపాజిట్ గల్లంతు అయింది.

మొనుగోడు నియోజికవర్గం 1967 లో ఏర్పడగా.. ఇప్పటివరకు అక్కడ 12 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో అరుసార్లు కాంగ్రెసే విజయం సాధించింది. ఐదు సార్లు కమ్యూనిస్టు పార్టీ గెలవగా, ఒక్కసారి టి‌ఆర్‌ఎస్ విజయం సాధించింది. మరి మునుగోడు గత చరిత్రను పరిశీలిస్తే అక్కడ కాంగ్రెస్, మరియు కమ్యూనిస్ట్ పార్టీలదే హవా నదించింది. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ డిపాజిట్ కూడా దక్కించుకోలేని స్థితిలో ఓటమి పాలు కావడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. ముంఖ్యంగా కాంగ్రెస్ ఇంత దారుణ పరాజయాన్ని చవిచూడడానికి గల కారణలపై విశ్లేషకులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణం అని కొందరి అభిప్రాయం.

గతంలో మునుగోడు నియోజిక వర్గంలో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ వీడడం. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయన బ్రదర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లో ఉంటూనే ఆ పార్టీకి వ్యతిరేకం ఉండడం.. ఇవ్వన్ని కూడా మునుగోడు ప్రజల దృష్టిని మళ్లించయని కొందరు రాజకీయ వాదులు చెబుతున్నారు. అదే విధంగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా మునుగోడు ఎన్నికపై సరైన ప్రణాళికబద్దంగా వ్యవహరించకపోవడం కూడా ఆ పార్టీ ఓటమికి కారణం అనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక మునుగోడు ప్రజలు ఆలోచనాత్మకంగా టి‌ఆర్‌ఎస్ ను గెలిపించడం కూడా కాంగ్రెస్ కు బిగ్ మైనస్. ఎందుకంటే టి‌ఆర్‌ఎస్ అధికార పార్టీ కావడంతో టి‌ఆర్‌ఎస్ ను గెలిపించడం వల్ల నియోజికవర్గానికి మంచి జరిగే అవకాశం ఎక్కువనే అనే భావన.. అలాగే టి‌ఆర్‌ఎస్ నేతలు మునుగోడుపై కురిపించిన వారాలజల్లు.. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ను మునుగోడు ప్రజలు మరిచిపోయేలా చేయాయి. మొత్తానికి ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మునుగోడులో ఆ పార్టీ కోట పేకమేడల్లా కూలిపోవడం నిజంగా కోలుకోలేని దేబ్బే.

ఇవి కూడా చదవండి

మూవీ పాలిటిక్స్.. ఇదే గురూ మన ట్రెండు !

జగన్ కు పవన్ వార్నింగ్ లు..ఫైర్ వెనుక అసలు కథ!

జగన్ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రలే అతి పెద్ద స్కామ్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -