Monday, April 29, 2024
- Advertisement -

ఈ దెబ్బ తో కాంగ్రెస్ మళ్ళీ పుంజుకునేనా..!!

- Advertisement -

జాతీయ కాంగ్రెస్ లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల సంగతి తెలిసిందే.. కాంగ్రెస్ లో తీవ్రమైన సంక్షోభంలో పరిగణిస్తున్న ఈ పరిస్థితి ని సోనియా గాంధీ తన చాకచక్యంతో సద్దుమణిగేలా చేసినా పార్టీ పై, ముఖ్యంగా గాంధీ కుటుంబం పై సీరియస్ గా ఉన్న పార్టీ సీనియర్ నేతలు ఏవిధంగా శాంతిస్తారు అనేదే అసలు ప్రశ్న.. ఇప్పటికే లేఖ ల మీద లేఖలు సంధిస్తూ పార్టీ అధిష్టానం పై ఒత్తిడి తెస్తున్నారు.. దాంతో పార్టీ ప్రతిష్ట దృష్ట్యా యా లేఖలో వారు ఏం రాశారన్నది చెప్పకపోయినా వారు ఎంత సీరియస్ గా ఉన్నది తెలుస్తుంది..

ముఖ్యంగా రాహుల్ గాంధీ వైఖరి పై వారు చాలా ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తుంది. ఇకపోతే అన్ని సమస్యల మధ్య కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే మోడిని, బిజెపి ని పలు సమయాల్లో విమర్శిస్తూ పార్టీ ఉనికిని చాటుతున్న కాంగ్రెస్ ఇప్పుడు పూర్వ వైభవం తెచ్చుకోవడానికి పెద్ద పెద్ద నిర్ణయాలే తీసుకుంటుంది.. బీహార్ లో ఎన్నికలకు అన్ని పార్టీ లు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వర్చువల్ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. జిల్లా, బ్లాక్ స్థాయిల్లో రాష్ట్రమంతటా ఈ ర్యాలీలు ఉండబోతున్నాయట.. ఈ ర్యాలీ మొదటిరోజు రాహుల్ గాంధీ ప్రసంగించే అవకాశం ఉందని అంటున్నారు..

అయితే ఈ తేదీ ఫైనల్ కాదని, ఇందులో మార్పు ఉండే అవకాశం లేకపోలేదు అని అంటున్నారు.. ఇప్పటికే పార్టీ బీహార్ ఎన్నికలకు సంభందించి స్క్రీనింగ్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిపింది. మిటీ చైర్మన్ అవినాష్ పాండే, బీహర్ ఇన్‌చార్జి శక్తిసిన్హ్ గోహిల్, ఇతర నేతలు హాజరయ్యారు. సెప్టెంబర్ 6 తర్వాత పలువురు బీజేపీ నేతలు బీహార్‌కు వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో అక్కడ ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది..  బీహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ప్రస్తుత అసెంబ్లీ గ గడువు నవంబర్ 29తో ముగియనుంది. దీంతో అక్టోబర్, నవంబర్‌లో ఎన్నికల నిర్వహణకు ఈసీ కసరత్తు చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -