Sunday, April 28, 2024
- Advertisement -

క‌ర్నూలు జిల్లాలోకి ప్ర‌వేశించిన జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప పాద యాత్ర‌…

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర క‌ర్నూలు జిల్లాలోకి ప్ర‌వేశించింది. ఇక్క‌డ‌నుంచె జ‌గ‌న్‌కు అస‌లుసిస‌లైన ప‌రీక్ష ఎదురుకానుంది. 6వ తేదీ యాత్ర మొదలైన దగ్గర నుండి మంగళవారం ఉదయం వరకూ సొంత జిల్లా కడపలోనే ప్రజాసంకల్పయాత్ర సాగింది.ఇప్ప‌టి వ‌ర‌కు సొంత‌జిల్లాలో ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

ఇంత‌వ‌ర‌కు బాగ‌నె ఉన్క‌నా మంగళవారం ఉదయం కడప-కర్నూలు జిల్లా సరిహద్దుల్లోని చాగలమర్రి మండలం గుండా కర్నూలు జిల్లాలోకి జగన్ ఎంటర్ అవుతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక‌లో అప‌జ‌యం ఎదురైన సంగ‌తితెలిసిందే. ఈ స‌మ‌యంలో జన సమీకరణ విషయంలో జిల్లా నేతలు ఏ మేరకు సక్సెస్ అవుతారో ఇప్పుడు తెలిసిపోతుంది. ఈ జిల్లాలో పోయిన ఎన్నికల్లో మెజారిటీ ఎంఎల్ఏలు వైసీపీ తరపున గెలిచినా తర్వాత టిడిపిలోకి ఫిరాయించారు. కాబట్టి పలు నియోజకవర్గాల్లో పట్టున్న నేతలు ఎవరు అన్న విషయం తేలిపోతుంది. జిల్లాలోని మొత్తం 7 నియోజకవర్గాల్లో 100 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుంది. ఆళ్ళగడ్డ, నంద్యాల, డోన్, ఎమ్మిగనూరు తదితర నియోజకవర్గాలునాయి.

దానికితోడు నియోజకవర్గాల్లో బలమైన నేతల్లో ఒకరుగా పేరున్న చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకు గురవ్వటంతో పాటు మొన్నటి నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా జిల్లాలోని కొందరు నేతలు టిడిపిలో చేరారు. దాంతో పలు నియోజకవర్గాల్లో వైసీపీకి నాయకత్వ కొరత ఉందని ప్రచారం జరుగుతోంది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో పార్టీ బ‌లంగా ఉంద‌నె విష‌యాన్ని అధికార‌పార్టీకి తెలియాలి. ఇప్ప‌టికె ముఖ్య‌నాయ‌కులు టీడీపీలోకి వెల్లిన త‌ర్వాత జన సమీకరణ విషయంలో కర్నూలు జిల్లా నేతలు ఏ మేరకు విజయం సాధిస్తార‌నేది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -