Wednesday, May 1, 2024
- Advertisement -

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రపై అన్నివర్గాల్లోనూ మొద‌లైన ఆస‌క్తి…

- Advertisement -

వైసీపీ అధినేత అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రపై అన్నివర్గాల్లోనూ ఆసక్తి మొదలైంది. వచ్చే నెల 6వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్ర మొదలుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్ప‌టికె పాద‌యాత్ర‌కు సంబంధించి రూట్ మ్యాప్ కూడా ఖ‌రార‌య్యింది. ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు 6 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 3వేల కిలోమీటర్లు జగన్ పాదయాత్ర చేయనున్న విషయం అందరికీ తెలిసిందే.

ప్ర‌ధానంగా రాయలసీమ జిల్లాల్లోని నాలుగు జిల్లాల్లోని సుమారు 700 కిలోమీటర్ల పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారైంది. దీని వెనుక బ‌ల‌మైన కార‌ణాలే ఉన్నాయి. తన పాదయాత్రలో భాగంగా కడప జిల్లాలో 8 రోజుల పాటు సుమారు 120 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తారు. పులివెందుల – కమలాపురం – జమ్మలమడుగు – ప్రొద్దుటూరు – మైదుకూరు నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర సాగనుంది.

తర్వాత కర్నూలు జిల్లాలోని చాగలమర్రి మీదుగా అనంతపురం- చిత్తూరు జిల్లాల్లోకి ప్రవేశిస్తారు. పాదయాత్రలో జగన్ ఎక్కువగా టీడీపీ శాసనసభ్యుల, మంత్రుల నియోజకవర్గాలనే టార్గెట్ గా పెట్టుకున్నారు. అందులో కూడా ప్రధానంగా వైకాపా నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాలలో పాదయాత్ర జరిగేలా ప్రత్యేక రూట్ మ్యాప్ ను ఫైనల్ చేసారు.

మ‌రో వైపు చంద్ర‌బాబుకూడా నాలుగుజిల్లాల‌పైనె దృష్టిసారించారు. వ‌చ్చె ఎన్నిక‌ల్లో వీలైన‌న్ని సీట్లు గెలిచి జ‌గ‌న్ దెబ్బ కొట్ట‌డానికి టీడీపీకూడా పావులు క‌దుపుతోంది. అందుకె జ‌గ‌న్ ప్ర‌ధానంగా ఈ జిల్లాల్లోనె పాద‌యాత్ర‌ను ప్ర‌తీ ష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -