Wednesday, May 1, 2024
- Advertisement -

జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి ఏర్పాట్లు స‌ర్వం సిద్ధం

- Advertisement -

ఏపి ఎన్నికల్లో ఘన విజయం అందుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రేపు ముహూర్తం ఖరారైన సంగ‌తి తెలిసిందే. విజ‌య‌వాడ‌లోని ఇందిరా గాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో ఏర్పాట్లు ఇప్ప‌టికే పూర్తి అయ్యాయి. ఇక న‌వ్యాంధ్ర రెండో సీఎంగా జ‌గ‌న్ ఛార్జ్ తీసుకోబోతున్నారు.

జ‌గ‌న్ ప‌దేళ్ల క‌ష్టానికి ఇప్పుడు ప్రతిఫ‌లం ద‌క్కింది. ఎన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కొని త‌ను అనుకున్న క్ష్యాన్ని చివ‌ర‌కు సాధించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో 151 ఎమ్మెల్యే, 22 ఎంపీసీట్లు సాధించి స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాడు. ఇప్పుడు సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారానికి రంగం సిద్దం అయ్యింది.

ఎండ కారణంగా అక్కడక్కడా షామియానాలు వేసి అవసరమైనచోట మంచినీరు, మజ్జిగ అందించబోతున్నారు.ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, కొత్త ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, లాయర్లు రాబోతున్నారు. ఎటువంటి భ‌ద్ర‌తా ప్ర‌మాదాలు త‌లెత్త‌కుండా 5000 మందితో పోలీసు బందోబ‌స్తును ఏర్పాటు చేశారు.

ప్రధాన వేదిక ముందుభాగంలో వీవీఐపీ, వీఐపీ, మీడియాకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమానికి వచ్చే వారికి ఐదు ర‌కాల‌ పాస్‌లు ఇవ్వనున్నారు. ఇక పార్కింగ్‌కు ఎటువంటి అసౌక‌ర్యాలు క‌ల‌గ‌కుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏఆర్ గ్రౌండ్స్, బిషప్ అజరయ్య స్కూల్, పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లలో వాహనాల పార్కింగ్‌ ఉంటుంది. 30న మధ్యాహ్నం 12.23కి జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుంది.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.డియం లోపల భద్రత, ట్రాఫిక్‌ మళ్లింపు, పార్కింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. గ్రౌండ్‌లో 12వేల మంది, గ్యాలరీలో 18వేల మంది కూర్చునేందుకు వీలుందని తెలిపారు. ప్రమాణ స్వీకారానికి 12 వేల పాసులు జారీ చేస్తున్నామని, సాధారణ ప్రజలను గ్యాలరీలోకి అనుమతిస్తామని సీపీ వెల్లడించారు.

స్టేడియం సమీపంలో 10వేల మంది వరకు వీక్షించేందుకు అనువుగా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలను శివారు మీదుగా మళ్లిస్తామని, ఇవాళ అర్ధరాత్రి నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు అమలవుతాయని వివరించారు. రేపు జ‌గ‌న్ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -