Wednesday, May 1, 2024
- Advertisement -

“అభినవ అంబేద్కర్ ” వైఎస్ జగన్.. నిజమేనా !

- Advertisement -

మనదేశంలో డాక్టర్ బి‌ఆర్ అంబేద్కర్ కు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రజలను ఒక్క తాటిపై నడిపేందుకు, సమైఖ్య భావాన్ని పెంపెండించేందుకు రాజ్యాంగాన్ని రచించి దేశానికి రూల్ ఆఫ్ గైడెన్స్ ను అందించారు అంబేద్కర్. ఆయన రచించిన రాజ్యాంగం ద్వారానే దేశం ఇప్పటికీ ముందుకు సాగుతోంది. అలాంటి అంబేద్కర్ స్థానాని మరెవరూ కూడా భర్తీ చేయలేరనేది జగమెరిగిన సత్యం. అయితే ఏపీలో అధికార పార్టీ నేతలు మాత్రం వైఎస్ జగన్ ను అంబేద్కర్ తో పొలుస్తూ ” అభినవ అంబేద్కర్ ” అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి ఉషశ్రీ మాట్లాడుతూ వైఎస్ జగన్ అభినవ అంబేద్కర్ అంటూ కొనియాడారు. .

మహిళా సాధికారత కోసం సి‌ఎం జగన్ ఎంతో కృషి చేశారని, గత ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని ఆమె చెప్పుకొచ్చారు. 2014 లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రూ. 14,205 కోట్ల రుణాన్ని మాఫీ చేయకుండా మహిళలను మోసం చేశారని, A, B, గ్రేడ్ లుగా ఉన్న మహిళా సంఘాలను C గ్రేడ్ కు పడిపోయేలా చంద్రబాబు చేశారని మంత్రి ఉషశ్రీ విమర్శించారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత 2 లక్షలకు పైగా సంఘాలు వచ్చాయని, డ్వాక్రా మహిళల కష్టాలు చూసి సి‌ఎం జగన్ నాలుగు దఫాలుగా నగదు చెల్లిస్తున్నారని చెప్పుకొచ్చారు.

కాగా అధినేతలపై ప్రశంశలు కురిపించడం సాధారణమే అయినప్పటికి.. ప్రస్తుతం ఏపీలో వైసీపీ నేతలు జగన్ పై మితిమీరిన పొగడ్తలు కురిపిస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఆ మద్య మంత్రి జోగి రమేశ్ కూడా వైఎస్ జగన్ ను స్త్రీ ల విధ్యోన్నతికి పాటుపడిన జ్యోతి రావు ఫూలేతో పోల్చుతూ.. వైఎస్ జగన్ అభినవ ఫూలే అంటూ పొగడ్తలు కురిపించారు. ఇలా మహేన్నత వ్యక్తులైన బి‌ఆర్ అంబేద్కర్, జ్యోతి రావు ఫూలే వంటి వారితో వైఎస్ జగన్ ను పోల్చడం స్వాగతించాల్సిన విషయం కాదని కొందరి భావన. తమ నాయకుడిపై అభిమానం ఉంటే పొగడడం తప్పుకాదని, అలా కాకుండా నాయకుడి వద్ద మొప్పుకోసం మహోన్నత వ్యక్తులతో పోల్చడం సరికాదని రాజకీయవాదులు వారి అభిప్రాయాలను వక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి వైసీపీ నేతలు వారి అధినేత వైఎస్ జగన్ పై చేసే భజన అప్పుడప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కే‌సి‌ఆర్ జగన్ దోస్తీ.. ఇదే అసలు వ్యూహమా ?

బి‌ఆర్‌ఎస్ వైరస్.. బీజేపీ వ్యాక్సిన్ !

వాలెంటిర్లపై.. టీడీపీ ఫోకస్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -