Tuesday, May 7, 2024
- Advertisement -

రుచికరమైన టమోటో రైస్ ఎలా తయారు చేయాలో తెలుసా?

- Advertisement -

సాధారణంగా మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేని సమయంలో కూరతో అవసరం లేకుండా ఎంతో రుచికరమైన టమోటో రైస్ తయారు చేసుకొని తినవచ్చు. అయితే ఎంతో తొందరగా రుచికరంగా టమోటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:
బాగా పండిన టమోటాలు 4, కారం ఒక స్పూన్, గరంమసాలా ఒక స్పూన్, ఒక ఉల్లిపాయ ఒకటి, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కొద్దిగా నీళ్ళు, నూనె, కరివేపాకు.

తయారీ విధానం:
*ముందుగా టమోటాలను శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయను కూడా చిన్న సైజు ముక్కలుగా తయారు చేసుకోవాలి.

*స్టవ్ మీద కడాయి ఉంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా వేడి అయిన తరువాత కరివేపాకు, పోపు దినుసులు, వేసి ఒక నిమిషం పాటు కలియబెట్టాలి.

*ఆవాలు చిటపట అన్న తరువాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అందులో టమోటో ముక్కలు వేసి బాగా కలియబెట్టాలి.

Also read:ప్లీజ్… 40 రూపాయిలు ఇవ్వండంటున్న రాశీ ఖన్నా!

*రెండు నిమిషాల తర్వాత కొద్దిగా ఉప్పు చిటికెడు పసుపు వేసి కలియబెట్టి మూత పెట్టాలి. ఈ విధంగా మూత పెట్టడం వల్ల టమోటాలు తొందరగా మెత్తబడతాయి.

*రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలియబెట్టి అందులోకి సరిపడా కారం వేసుకోవాలి. ఈ విధంగా తక్కువ మంటపై కారం బాగా మగ్గనివ్వాలి. ఒక ఐదు నిమిషాల తరువాత గరంమసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిలోకి కొత్తిమీర తురుమును కలుపుకొని మరోసారి కలియబెట్టాలి.

Also read:వార్ని.. సీరియల్ నటి కూడా మ్యాటర్ అంటూ డైలాగులు వేసిందిగా!

*ఈ విధంగా తయారైన టమోటా మిశ్రమంలోకి ముందుగా తయారు చేసి పెట్టుకొన్న రైస్ వేసి కలిపితే ఎంతో రుచికరమైన టమోటో రైస్ తయారైనట్లే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -