Friday, May 10, 2024
- Advertisement -

2 బంతుల్లో 18 పరుగులు.. ఐపీఎల్ లో ఇది సంచలనం..

- Advertisement -
18 runs in 2 balls

క్రికెట్ లో ఒక బంతిలో  6 పరుగులకంటే ఎక్కువ సాధించడం చాలా కష్టం. అలాంటప్పుడు 2 బంతులకు 12 పరుగలకు మించి రావు. కానీ ఐపీఎల్ మ్యాచ్ లో కేవలంరెండు బంతుల్లోనే 18 పరుగులు రావడం గమనార్హం. ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల జరిగి మ్యాచ్ సందర్భంగా ఇది జరిగింది. కేవలం రెండు బంతుల్లో 18 రన్లను నైట్ రైడర్స్ సాధించింది.

ముంబై ఇండియన్స్ బౌలర్ మెక్లెనగన్ వేసిన ఒక ఓవర్ లో ఇలా రెండు బంతుల్లో 18 పరుగులు వచ్చాయి. ఇది ఎలా సాధ్యమైందంటే.. మెక్లెనగన్ వేసిన తొలి బంతికి భారీ సిక్సర్ కొట్టాడు మనీష్ పాండే. ఆ తర్వాత బంతిని బౌండరీకి తరలించాడు. ఈ బంతి నో బాల్ కావడంతో, అదనంగా మరో బంతి వేయాల్సి వచ్చింది. ఈ బంతిని అంపైర్ వైడ్ గా ప్రకటించాడు. ఆ తర్వాత వేసిన ఎక్స్ ట్రా బాల్ ను మళ్లీ భారీ సిక్సర్ గా మలిచాడు పాండే.

దాంతో.. రెండు బంతుల్లోనే 6, 5, 1, 6 పరుగులు కలుపుకొని మొత్తంగా 18 పరుగులు వచ్చాయి. వేసింది నాలుగు బంతులు అయినప్పటికి క్రికెట్ లెక్కల ప్రకారం నోబాల్, వైడ్ లెక్కలోకి రావు. కానీ.. వాటి ఆధారంగా పరుగులు సాధించే అవకాశం ఉంది. ఇలా.. టెక్నికల్ గా రెండు బంతుల్లో మొత్తం 18 పరుగులు చేయడం సాధ్యమైంది. 

Related

  1. ఐపీఎల్ పై వేల కోట్ల బెట్టింగ్స్
  2. కూలీ కొడుకు… ఐపీఎల్ లో ఆడే ఛాన్స్ ఎలా వచ్చిందంటే..?
  3. ఐపీఎల్‌ 10లో… ఆటోడ్రైవర్‌ కొడుకు.. 2.6 కోట్లకు అమ్ముడు పోయాడు
  4. జియోకి పోటీ ఇచ్చిన ఐడియా.. సూపర్ ఆఫర్ ఇదే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -