Monday, April 29, 2024
- Advertisement -

కోహ్లీ బర్త్ డే…సచిన్ రికార్డు సమం

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇక ఇవాళ తన బర్త్ డే సందర్భంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. సచిన్ 49 సెంచరీలు చేయగా విరాట్ సచినక్ కంటే 177 తక్కువ ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్‌ని సాధించాడు. సచిన్ 452 మ్యాచ్‌ల్లో 49 సెంచరీలు చేయగా విరాట్ కేవలం 277 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీటహి అందుకున్నాడు. ఇక ఇవాళ విరాట్ బర్త్ డే కూడా. దీంతో ఫ్యాన్స్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఇక పుట్టినరోజు సందర్భంగా సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా నిలిచాడు కోహ్లీ. అంతకంటే ముందు 1993లో కాంబ్లీ 100,1198లో సచిన్ 134,2008లో జయసూర్య,2011లో టేలర్,2022లో టామ్ లాథమ్,2023 వరల్డ్ కప్‌లో మార్ష్ సెంచరీలు చేశారు. ఇక కోహ్లీ ఇంకో సెంచరీ చేస్తే 50 సెంచరీలు చేసిన ఏకకైక ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు విరాట్.

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో 121 బంతుల్లో 10 ఫోర్లతో విరాట్ 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 326 పరుగులు చేసింది. రోహిత్ 40 పరుగులు చేయగా శ్రేయాస్ అయ్యార్ 77, చివర్లో జడేజా 29 పరుగులతో ధాటిగా ఆడారు. ఇక వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటికే భారత్ సెమీస్ చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -