Monday, April 29, 2024
- Advertisement -

మూడో టెస్ట్‌లో భారీ స్కోరు దిశ‌గా భార‌త్‌…

- Advertisement -

బాక్సింగ్ డే’ టెస్ట్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. తొలి టెస్ట్ ఆడుతున్న మయాంక్ అగర్వాల్, టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ పూజారా హాఫ్ సెంచరీలతో అదరగొట్టడంతో మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 89 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసి టీమిండియా ప‌టిష్ట‌స్థితో ఉంది.

ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76), ఛటేశ్వర్ పుజారా (68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ (47 నాటౌట్) రాణించడంతో భారత్ భారీ స్కోరు దిశ‌గా ప‌య‌నిస్తోంది. అరంగేట్రంలోనే అదరగొట్టిన మయాంక్ అగర్వాల్ 76 పరుగులు చేసి అవుట్ కాగా, హనుమ విహారి 8 పరుగులకే వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్ లో కోహ్లీ (47), చటేశ్వర్ పుజారా (68) ఉన్నారు. మరో వైపు ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ ఒక్కడికే రెండు వికెట్లు దక్కాయి.

మయాంక్ ఔటైన త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన కోహ్లీ మ‌రో వికెట్ ప‌డ‌కుండా పుజారాకు చక్క‌ని స‌హాకార‌న్ని అందిస్తూ ముందుకు సాగుతున్నారు. పుజారా, కోహ్లీ ఇద్దరూ ఆచితూచి ఆడుతూ అవకాశం చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. వీరి భాగస్వామ్యాన్ని విడదీయడానికి ఆసీస్ బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు.

మయాంక్‌తో కలిసి రెండో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన పుజారా.. కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మొత్తం మీద తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -