Monday, April 29, 2024
- Advertisement -

రెండో టి20 బరిలో భారత్‌….

- Advertisement -

వ‌న్డేసిరీస్‌ను 2-1తో కైవ‌సం చేసుకున్న కోహ్లీసేన ఇప్పుడు టీ20 సిరీస్‌పై క‌న్నేసింది. మొద‌టి టీ20లో న్యూజిలాండ్ పై భారీ విజ‌యాన్ని న‌మేదు చేసింది. ఆత్మ‌విశ్వాసంతో రెట్టింపు బ‌రిలో దిగుతున్న టీమిండియా రెండో మ్యాచ్‌లోగెలిచి సిరీస్‌ను కైవ‌సం చేసుకొనేందుకు వ్యూహాలు ప‌న్న‌తోంది.

మ‌రో వైపు వ‌న్డేసిరీస్‌, మొద‌టి టీ20 మ్యాచ్‌ను చేజార్చుకున్న న్యూజిలాండ్ పొట్టిసిరీస్‌ను కాపాడుకొనె ప్ర‌య‌త్నంలో పోరుకు సిద్ద‌మ‌య్యింది. రాజ్‌కోట్‌లో జ‌ర‌గ‌నున్న రెండో టీ20 మ్యాచ్‌లో క‌హ్లీ బృదం న్యూజిలాండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. తొలి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలుపొందిన భారత్‌ ఇక్కడ కూడా గెలిస్తే మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. అద్భుత ఫామ్‌లో ఉన్న భారత్‌ను నిరోధించి సిరీస్‌లో సమ ఉజ్జీగా నిలవాలంటే న్యూజిలాండ్‌ తీవ్రంగా శ్రమించాల్సి ఉంది.

తొలి టి20 మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన తర్వాత భారత జట్టు మరో ఆలోచన లేకుండా అదే జట్టును కొనసాగించవచ్చు. ఓపెనర్లు శిఖర్‌ ధావన్, రోహిత్‌ శర్మ రికార్డు భాగస్వామ్యం, కోహ్లి మెరుపులు, బౌలర్ల ప్రతిభ జట్టును గెలిపించాయి. హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌లో విఫలమైనా… ఆల్‌రౌండర్‌గా అతని విలువ అమూల్యం. భువనేశ్వర్, బుమ్రా పదునైన బౌలింగ్‌ భారత్‌ బలం కాగా, మంచు ప్రభావం ఉన్నా బంతిని సమర్థంగా తిప్పగలిగిన అక్షర్, చహల్‌లను ఎదుర్కోవడం కివీస్‌కు అంత సులువు కాదు. అయితే గత మ్యాచ్‌లో ఆడిన నెహ్రా రిటైర్‌ కావడంతో అతని స్థానంలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

తొలి టి20లో 203 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో న్యూజిలాండ్‌ ఏ దశలోనూ కనీస ఆటతీరు కూడా కనబర్చలేదు. జట్టు బ్యాట్స్‌మన్‌ అంతా సమష్టిగా విఫలమయ్యారు. తమ ప్రధాన ఆటగాడు గప్టిల్‌ నుంచి కివీస్‌ ఆశిస్తున్న మెరుపు ఇన్నింగ్స్‌ నాలుగు మ్యాచ్‌లలో కూడా రాలేదు. రో ఓపెనర్‌ మున్రో కూడా అంతంత మాత్రంగానే ఆడుతుండగా… విలియమ్సన్‌ వైఫల్యం కూడా జట్టును దెబ్బ తీస్తోంది. ఇలాంటి స్థితిలో ఆ జట్టు బ్యాటింగ్‌లో కోలుకొని భారీ స్కోరు చేయా ల్సి ఉంది. భారీ షాట్లు ఆడగల నికోల్స్, ఆల్‌రౌండర్‌ గ్రాండ్‌హోమ్‌ కూడా తమ బాధ్యతను తగిన విధంగా నిర్వర్తించలేకపోతున్నారు. పేసర్లు బౌల్ట్, సౌతీ మరింత మెరుగ్గా బౌలింగ్‌ చేయాల్సి ఉంది. ఢిల్లీ మ్యాచ్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన లెగ్‌ స్పిన్నర్‌ సోధి, లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ సాన్‌ట్నర్‌ భారత బ్యాట్స్‌మెన్‌ను మరోసారి నియంత్రించాలని పట్టుదలగా ఉన్నారు. గత మ్యాచ్‌లో చెలరేగిన టీమిండియా అదే జోరుతో రాజ్‌కోట్‌లోనే సిరీస్‌ను సొంతం చేసుకుంటుందా? పోరాటానికి మారుపేరైన కివీస్‌ గెలుపుతో ఫలితాన్ని మూడో మ్యాచ్‌ వరకు తీసుకెళుతుందా వేచి చూడాలి.

తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్, రోహిత్, అయ్యర్, పాండ్యా, ధోని, అక్షర్, భువనేశ్వర్, చహల్, బుమ్రా, సిరాజ్‌/కార్తీక్‌/పాండే.
న్యూజిలాండ్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), గప్టిల్, మున్రో, టేలర్‌/బ్రూస్, లాథమ్, నికోల్స్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, బౌల్ట్, సౌతీ, సోధి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -