Tuesday, April 30, 2024
- Advertisement -

ఆర్‌సీబీ ఆట‌గాడు డికాక్‌ని కొనుగోలు చేసిన ముంబ‌య్‌….

- Advertisement -

వచ్చే ఏడాది జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2019 కోసం ఆయా ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నాయి. గత ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడిన దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డికాక్‌ని తాజాగా ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ రూ. 2.8 కోట్లకి కొనుగోలు చేసింది.

డిసెంబర్‌లో జరగనున్న ఐపీఎల్ ఆటగాళ్ల వేలానికి ముందే రెండు ఫ్రాంఛైజీలు పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి. 2018 వేలంలో డికాక్‌ను రూ.2.8కోట్లు వెచ్చించి బెంగళూరు దక్కించుకుంది. ఇప్పుడే అదే ధరకు ముంబయి కొనుగోలు చేసింది. ఇప్పటికే ముంబయి టీమ్‌లో ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్లు ఇషాన్ కిషన్, ఆదిత్య తారె ఉన్నారు. తాజాగా సీనియర్ వికెట్ కీపర్ డికాక్.. రోహిత్ సేనలో చేరడంతో టీమ్ మరింత బలం పెరిగింది.

వాస్తవానికి డిసెంబరు 16న గోవా వేదికగా ఐపీఎల్ 2019 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం జరగనుంది. కానీ.. ఆ వేలం సమయానికి టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీల వద్ద గత ఏడాది వేలం తర్వాత మిగిలిన సొమ్ము‌ని మినహాయించి అదనంగా రూ.3 కోట్లు డబ్బు ఉండాలనేది నిబంధన. దీంతో.. అన్ని ఫ్రాంఛైజీలు తాము వద్దనుకున్న ఆటగాళ్లను విడిచిపెట్టడంతో పాటు.. తమకి కావాల్సిన క్రికెటర్లని కొనుగోలు చేయడం మొదలెట్టాయి.

తాజాగా డికాక్‌ని కొనుగోలు చేసిన ముంబయి ఫ్రాంఛైజీ.. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ (రూ. 2.2 కోట్లు), శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ అఖిల ధనంజయ (రూ.50 లక్షలు)లను విడిచిపెట్టింది. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకి ఆడిన డికాక్.. ఇప్పటి వరకు 34 మ్యాచ్‌ల్లో 927 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకంతో పాటు ఆరు అర్ధశతకాలు కూడా ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -