Thursday, May 9, 2024
- Advertisement -

​కష్టాల్లో కొహ్లీ.. అందుకే గంగూలీ సలహాలు

- Advertisement -
sourav suggestions for kohli

కెఫ్టెన్ గా కొహ్లీ తీరును గంగూలీ బాగా ఇష్టపడుతారు. ఇక కొహ్లీ కూడా గతంలో తనకు స్ఫూర్తి గంగూలీనే అని చెప్పాడు. ఆట సమయంలో ఎందుకు దూకుడుగా ఉంటావని కొహ్లీని గంగూలీ అడిగితే.. అచ్చం  నీలాగే అన్నాడట కొహ్లీ. అయితే ప్రస్తుతం కొహ్లీకి బ్యాడ్ టైం నడుస్తున్నట్లుగా ఉంది. గాయపడటం, కొన్ని మ్యాచ్ లకు దూరం కావడం.. ఆ అత్ర్వా ఆర్సీబీ తరుపున బరిలోకి దిగినా.. టీమ్ ప్రదర్శన సరిగా లేకపోవడంతో కొహ్లీ నిరుత్సాహంగానే కనిపిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు కూర్పు గురించి కొన్ని సలహాలిచ్చాడు సౌరవ్. గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహం గురించి తన అభిప్రాయాలను చెప్పాడు దాదా. మరి ఆర్సీబీ కెప్టెన్ కు సౌరవ్ ఇచ్చే సలహాలేమిటంటే… ఎట్టి పరిస్థితుల్లోనూ గేల్ ను బెంచ్ కు పరిమితం చేయొద్దు అనేది. గేల్ ను పక్కన పెట్టి ఆర్సీబీ బరిలో దిగుతుండటాన్ని దాదా తప్పుపట్టాడు. ఆల్ రౌండర్ అయిన వాట్సన్ ను ఫైనల్ ఎలెవన్ లోకి తీసుకుంటున్నారు కానీ.. అతడు సరిగ్గా ఆడటం లేదని గంగూలీ అన్నాడు. వాట్సన్ కన్నా గేల్ ఎంపికే మేలు అని సలహా ఇచ్చాడు.

అలాగే డివిలియర్స్ ను టాపర్ ఆర్డర్ లో కాకుండా ఆరు, ఏడు స్థానాల్లో ఉపయోగించుకోవాలన్నాడు. ఫినిషర్ గా డివిలియర్స్ పని పూర్తి చేయగలడని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఆఖరి స్థానంలో ఉంది. అయితే ఆర్సీబీ కథ అప్పుడే అయిపోలేదని.. గత సీజన్ లోనూ వెనుకబడి పుంజుకుందని, ఇప్పుడు కూడా అలాగే జరగగలదని సౌరవ్ అన్నాడు.

Related

  1. ఐపీఎల్-10లో మొదటి హ్యాట్రిక్
  2. 2 బంతుల్లో 18 పరుగులు.. ఐపీఎల్ లో ఇది సంచలనం..
  3. ఐపీఎల్ పై వేల కోట్ల బెట్టింగ్స్
  4. కూలీ కొడుకు… ఐపీఎల్ లో ఆడే ఛాన్స్ ఎలా వచ్చిందంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -