Sunday, April 28, 2024
- Advertisement -

ఈసారి వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్‌ను చిత్తుగా ఓడిస్తాం….పాక్‌

- Advertisement -

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు అన్ని దేశాలు సిద్ద‌మ‌వ‌తున్నాయి. ఇక భార‌త్‌, పాకిస్థాన్ మ్యాచ్‌లంటే చెప్పాల్సిన ప‌నిలేదు. రెండు జ‌ట్లు మ్యాచ్‌లో త‌ల‌ప‌డితే దాని మ‌జానే వేరు. తాజాగా పాక్ మాజి కెప్టెన్ మొయిన్ ఖాన్ టీమిండియాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈసారి ప్ర‌పంచ క‌ప్‌లో పాక్ భార‌త్‌ను చిత్తుగా ఓడిస్తుంద‌ని త‌న నోటికి ప‌నిచెప్పారు. ఇప్ప‌టికే పాక్ క్రికెట్ బోర్డు ప్రపంచ కప్ జట్టుకు కెప్టెన్‌గా సర్ఫరాజ్ అహ్మద్‌ను ప్రకటించేసింది.

ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని మ్యాచ్‌ల్లోను భార‌త్‌పై పాక్‌దే పైచేయి. కాన ప్ర‌పంచ క‌ప్‌లో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు పాక్ గెలిచిని చ‌రిత్ర‌లేదు. ఆరు ప్రపంచ కప్ ట్రోఫీల్లో తలపడిన ఇండియా, పాకిస్థాన్‌లలో భారత్‌దే హవా. కానీ, ఈసారి ఆ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టిస్తామంటున్నాడు మొయిన్ ఖాన్. ఈ ఏడాది జరగబోయే వరల్డ్‌కప్‌లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 16న జరగనుంది. ప్రస్తుత పాకిస్థాన్ టీమ్‌లో నైపుణ్యానికి కొదవలేదు. సర్ఫరాజ్ అహ్మద్ టీమ్‌ను అద్భుతంగా మార్చాడు.

1992, 1999 వరల్డ్‌కప్‌లలో ఇండియాతో ఆడిన పాకిస్థాన్ టీమ్‌లో మొయిన్ ఖాన్ సభ్యుడిగా ఉన్నాడు. రెండేళ్ల కిందట చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియాను పాకిస్థాన్ చిత్తు చేసిన విషయాన్ని అతడు గుర్తు చేశాడు. ఈసారి ప్ర‌పంచ‌క‌ప్‌లోఇంగ్లాండ్ వాతావరణానికి తగ్గట్లుగా బౌలింగ్ చేయడానికి పాకిస్థాన్ బౌలర్లు సిద్దమవుతున్నారని తెలిపాడు. పైగా మూడు వారాల ముందే ఇంగ్లండ్ వెళ్లి ప్రాక్టీస్ మొదలుపెట్టనుండటం కూడా పాకిస్థాన్‌కు కలిసి వస్తుందని అభిప్రాయపడ్డాడు. మే, జూన్ నెలల్లో ఇంగ్లండ్ పిచ్‌లలో తేమ ఉంటుందని, అది పాక్ బౌలర్లకు అనుకూలిస్తుందని చెప్పాడు. గతేడాది పాక్, భారత్‌ల మధ్య ఆఖరుగా జరిగిన ఆసియా కప్‌లోనూ భారత్‌దే పైచేయి అనే విషయం మొయిన్ ఖాన్ మర్చిపోయిన‌ట్లున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -