Tuesday, May 7, 2024
- Advertisement -

జగన్ వదిలేస్తే.. మేము పూర్తి చేస్తాం !

- Advertisement -

ఏపీ లో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పోలవరం పై ఎప్పుడు కూడా రాజకీయ వివాదాలు జరుగుతూనే ఉంటాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడం కోసం ఏపీ ప్రజలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వాలు మారుతున్న ప్రాజెక్ట్ మాత్రం పూర్తి కావడం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కల్పించారు. దాంతో ప్రాజెక్ట్ పూర్తయ్యే అవకాశం ఉందని భావించరంతా కానీ అలా జరగలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నిర్మాణ పనులు వేగంగా జరిగినప్పటికి, ప్రాజెక్ట్ మాత్రం అనుకున్నట్టుగా పూర్తి కాలేదు.

ఆ తరువాత పోలవరం విషయంలో కేంద్రం నిదులు విడుదల చేయడంలేదని ఇక రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ప్రాజెక్ట్ ను పూర్తి చేసే పనిలో పడింది.. అయితే ఈ లోపు ఎన్నికలు రావడం.. చంద్రబాబు పోయి.. వైఎస్ జగన్ సి‌ఎం కావడం అన్నీ చక చక జరిగిపోయాయి. అయితే జగన్ తొలి కేబినెట్ లో జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ పోలవరాన్ని 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని కుండబద్దలు కొట్టినట్లు చెప్పుకొచ్చారు. కానీ 2021 పోయి 2022 వచ్చిన పోలవరం మాత్రం పూర్తి కాలేదు.. ఈ నేపథ్యంలో జగన్ హయం లోనైనా పూలవరం పూర్తి అవుతుందా ? లేదా ? అనే సందేహాలు ఏపీ ప్రజల్లో నెలకొంటున్నాయి.

ఇక తాజాగా పోలవరం విషయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం జగన్ వల్ల కాకపోతే.. తాము పూర్తి చేస్తామంటూ వ్యాఖ్యానించాడు. అయితే సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. సి‌ఎం జగన్ పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్రానికి అప్పగించాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్రానికి అప్పగిస్తే.. వచ్చే ఎన్నికల లోపు పోలవరాన్ని పూర్తి చేసి.. ఎన్నికల్లో పోలవరం ప్రాజెక్ట్ ను బీజేపీ ప్రచార అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది. దాంతో బీజేపీ ఏపీ లో కొంత మేర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి పోలవరం విషయంలో సి‌ఎం జగన్.. సోము వీర్రాజు చెప్పినట్లుగా కేంద్రాని అప్పగిస్తారా ? లేక జగన్ సర్కారే ఎన్నికల లోపు పోలవరాన్ని పూర్తి చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడతారా ? అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి

వెంకయ్య తప్పుకున్నాడా ? తప్పించరా ?

మద్యపాన ఆదాయంపై.. జగన్ చూపు ?

జగన్ నయా ప్లాన్ ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -