Tuesday, April 30, 2024
- Advertisement -

క్రాస్ ఓటింగ్ జరిగిందా.. ముర్ము గెలుపుకు కారణం ఆదేనా ?

- Advertisement -

దేశంలో 15 వ రాష్ట్రపతిగా గిరినజ మహిళ ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. జులై 18 న రాష్ట్రపతి ఎన్నికలు జరుగగా.. జులై 21న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పై ఎన్డీయే అభ్యర్థి అయిన ద్రౌపది ముర్ము భారీ తేడాతో గెలుపొందారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అధికారిక వివరాల ప్రకారం.. ముర్ము కు నమోదైన ఓట్లు 2,161 కాగా వాటి విలువ 5,77,777 గా ఉంది. ఇక యశ్వంత్ సిన్హా కు నమోదైన ఓట్లు 1,058 కాగా వాటి విలువ 2,61,062 గా ఉంది. మొత్తం 3,219 ఓట్లు చెల్లుబాటు కాగా వాటి విలువ 8,38,839 గా ఉంది. ఇక దేశంలోనే మొట్టమొదటి సారిగా ఒక గిరిజన మహిళా రాష్ట్రపతి గా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. .

ఈ నెల 24వ తేదీ నాటికి ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ పదవి కాలం ముగియనుండడంతో.. 25న ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసి భాద్యతలు చేపట్టనున్నారు. అత్యధిక మెజారిటీతో గెలుపొందిన మహిళా రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నిలిచారు. అయితే అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ము ఇంతటి సంచలన విజయాన్ని ఆందోకోవడానికి మోడి- అమిత్ షా వ్యూహమే అని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుతానికి కు చెక్ పట్టాలని భావించిన విపక్షలకు.. ఎత్తుకు పై ఎత్తు వేసి ఎవరు ఊహించని విధంగా ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది మోడి ప్రభుత్వం. ఇక్కడే బిజెపి సగం విజయం సాధించిందని విశ్లేషకులు చెబుతున్నారు. ద్రౌపది ముర్ము గిరిజన మహిళా కావడంతో ప్రాంతీయ పార్టీల నుంచి కూడా ఆమెకు మద్దతు భారీగా పెరిగింది.

బీజేపీతో ఏమాత్రం సంబంధం లేని శివసేన, వైసీపీ, టీడీపీ వంటి చాలా పార్టీల నుంచి కూడా బీజేపీ అభ్యర్థికి మద్దతు లభించింది. దాంతో రాష్ట్రపతి ఎన్నికల్లో చాలా వరకు క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం మొత్తం 104 మంది ఎమ్మేల్యేలు అనగా అసోం లో 22 మంది, మేఘాలయ లో 16 మంది, మద్య ప్రదేశ్ లో 19 మంది, జార్ఖండ్ లో 10, గుజరాత్ లో 10 మంది, ఛత్తీస్ ఘడ్ లో 6 మంది, గోవాలో నలుగురు.. ఇలా చాలా రాష్ట్రాలలోని ఎమ్మేల్యేలు బీజేపీ తో ఏమాత్రం సంబందం లేనప్పటికి బీజేపీ అభ్యర్థి అయిన ద్రౌపది ముర్ము కు ఓటు వేయడం గమనార్హం. దీంతో ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా ద్రౌపది ముర్ము ఆదివాసీ మహిళా కావడంతో అన్నీ పార్టీల నుంచి కూడా సానుకూల మద్దతు లభించింది. ఇదే ఆమె గెలుపుకు ప్రధాన కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు.

More Like This

పెరిగిన ధరలు.. మోడీకి ప్రమాదమే ?

చంద్రబాబుకు షాక్ ఇస్తున్న టీడీపీ శ్రేణులు ?

మోడీపై ఉమ్మడి పోరు సాధ్యమేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -