Tuesday, April 30, 2024
- Advertisement -

‘భాగమతి’ రివ్యూ

- Advertisement -

క‌థ‌నాయిక ప్ర‌ధాన ఇతివృత్తంతో సినిమాలు తీయాలంటే అనుష్క‌నే కావాలి. ఒక‌ప్పుడు విజ‌య‌శాంతి పోషించిన పాత్ర‌ను ఇప్పుడు అనుష్క పోషిస్తోంది. హీరోయిన్ ప్ర‌ధాన ఇతివృత్తంతో సినిమాలు అంద‌రికీ అనుష్కనే గుర్తొస్తుంది. ఆ విధంగా స్విటీ మారింది. స్విటీతో ప‌నిచేస్తే సినిమా హిట్టే అనేంత క్రేజీ ఏర్ప‌డింది. అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి సినిమాలు ఆమె న‌ట‌న‌కు గీటురాయిగా నిలిచాయి. ఇప్పుడు అనుష్క ‘భాగమతి’గా థియేట‌ర్ల‌కు వ‌చ్చింది. ట్రైల‌ర్‌లోనే ర‌ఫ్పాడించిన అనుష్క ఇక సినిమాలో ఎలా చేసిందో? సినిమా ఎలా ఉందో చూద్దాం!

క‌థ‌: చ‌ంచ‌ల (అనుష్క) ఐఏఎస్‌ అధికారి. కేంద్ర మంత్రి ఈశ్వర్‌ ప్రసాద్ (జయరాం) దగ్గర వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శిగా పని చేస్తుంటుంది. జ‌య‌రాం మంచి రాజ‌కీయ నాయ‌కుడు. సీఎం ప‌ద‌వికి ఎక్క‌డా పోటీప‌డ‌తాడ‌నోన‌ని అత‌డి రాజ‌కీయ జీవితం గిట్ట‌ని కొంద‌రు.. అధిష్టానం అతడిని ఏదో ఒక కేసులో ఇరికించాలని నిర్ణయిస్తారు. అప్పటికే ఒక హత్య కేసులో జైలులో ఉన్న చంచలను సీబీఐ తన కస్టడీలోకి తీసుకుని పురాతన భాగమతి బంగ్లాకు తరలించి, ఈశ్వర్‌ప్రసాద్‌ చేసిన వ్యవహారాలపై ఆరా తీస్తారు. ఈ క్రమంలో ఈశ్వర్‌ప్రసాద్‌ గురించి ఎలాంటి నిజాలు తెలిశాయి. ఆ హత్య కేసు ఏంటి? చంచల జైలుకు వెళ్లడానికి కారణం ఏంటి? ఆమె ఎవరిని? ఎలా హత్య చేసింది? ఆమెకూ, కాళంగి రాజ్య భాగమతి శతపత్ర రాణికీ సంబంధం ఏంటి? శక్తి (ఉన్ని ముకుందన్) కి భాగ‌మ‌తికి సంబంధం ఏంటి అనేవి సినిమా చూస్తేనే తెలుస్తాయి.

భాగమతి సినిమాలో అనుష్క ప్ర‌ధాన పాత్ర‌. సినిమా అంతా ఆ పాత్ర చుట్టూ తిరుగుతుంటుంది. భాగమతి కంటే కూడా చంచల కథే ఎక్కువ. ఒక రాజకీయ నాయకుడి నేర ప్రస్థానం గురించి వివ‌రిస్తూ భాగమతి బంగ్లా నేపథ్యాం జోడించి, భయపెట్టే ప్రయత్నం ద‌ర్శ‌కుడు చేశాడు. కొన్ని చోట్ల భ‌యాత్మ‌క సీన్లు భ‌య‌పెట్టేశాయి. తమన్‌ నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్ల‌స‌య్యింది. ఎత్తులు, పైఎత్తులు రాజ‌కీయ నాయ‌కుడి పన్నాగాన్ని చిత్తు చేసే చంచల కథగా ఈ సినిమా ఉంది.

ఈ సినిమా భాగమతి బంగ్లా కీల‌క పాత్ర‌గా చెప్ప‌వ‌చ్చు. ఈ బంగ్లాలోకి వెళ్లాకే అసలు కథ మొద‌ల‌వుతుంది. ఎక్కువ సన్నివేశాలను బంగ్లాను చూపించడానికే పరిమితం చేయ‌డంతో సన్నివేశాలు సాగదీసిన‌ట్టు క‌నిపిస్తాయి. ఇంట్ర‌వెల్ భాగమతి అవతారంలో అనుష్క తెరపై కనిపించి కథను ఆసక్తికరంగా మారుస్తుంది. ద్వితీయార్ధంలో వచ్చే మలుపులు చంచలను విలన్‌గా మార్చినంత పనిచేస్తాయి. దాంతో కథ ఎటువైపు మళ్లుతుందో అనే ఉత్కంఠ రేకెత్తుతుంది. కానీ, అక్కడ మరో మలుపు చోటు చేసుకోవడంతో పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

అనుష్క న‌ట‌న సినిమాకు ప్రధాన బలం. రెండు పాత్రల్లో న‌టించి అరుంధ‌తి మాదిరి న‌ట‌న వ‌చ్చింది.ముఖ్యంగా భాగమతిగా భయపెట్టిన విధానం బాగుంది. ఐఏఎస్‌ అధికారి పాత్రకు తగినట్టుగా చాలా హుందాగా నటించింది. ఆశా శరత్‌, జయరాం, ఉన్ని ముకుందన్‌ పాత్రలు త‌మ ప‌రిధి మేర‌కు న‌టించారు. ప్రభాస్‌ శ్రీను, ధనరాజ్‌, విద్యుల్లేఖ రామన్ నవ్వించారు. సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులు పడతాయి. మది ఛాయాగ్రహణం, తమన్‌ నేపథ్య సంగీతం భయపెట్టిస్తుంది. రవీందర్‌ కళా నైపుణ్యం తెరపై అడుగడుగునా కనిపిస్తుంది. దర్శకుడు అశోక్‌ కథ రాసుకున్న విధానం, కథనాన్ని అల్లిన వైనం బాగుంది. యూవీ క్రియేషన్స్‌ నిర్మాణ విలువలు చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి.

నటీనటులు: అనుష్క, ఉన్ని ముకుందన్‌, జయరాం, ఆశాశరత్‌, ప్రభాస్‌ శ్రీను, ధన్‌రాజ్‌, విద్యుల్లేఖ తదితరులు
ద‌ర్శ‌కుడు : జి.అశోక్‌
సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌
నిర్మాతలు : వంశీ.. ప్రమోద్ (యూవీ క్రియేషన్స్‌)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -