Monday, April 29, 2024
- Advertisement -

13 వ వారం శ్యామల ఎలిమినేట్ పక్కా

- Advertisement -

చేసిన ద్రోహానికి శిక్ష. కన్నింగ్ గేమ్ ప్లాన్ పై కన్నెర్ర. గుంటనక్కకు అదనుచూసి చావుదెబ్బ. నమ్మకద్రోహికి హౌస్ నుంచి బహిష్కరణ. ఇవన్నీ యాంకర్ శ్యామల గురించే. నెటిజన్లు, బిగ్ బాస్ ప్రేక్షకులు, కౌషల్ అభిమానులు చేస్తున్న ట్రోల్సులో భాగమే ఈ డైలాగులు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి శ్యామల ఎలిమినేట్ అయిపోనట్టు ఈ వారం లీక్ వచ్చేసింది. గతంలో తేజశ్వి ఎలిమినేషన్, శ్యామల, నూతన్ నాయుడు రీ ఎంట్రీ, గణేశ్ ఎలిమినేషన్ సహా అనేక లీకులు ఇచ్చిన తేజశ్వి ఫ్రెండ్ హారిక ఇన్నమూరి తాజా లీక్ శ్యామల ఎలిమినేషన్ వార్త. శ్యామల పేరును విడదీస్తూ శ్యా….మ ల్లా…అంటూ ద్వందార్ధం వచ్చేటట్టు ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. దాని అర్ధం ఏంటంటే శ్యామల మళ్లీ ఎలిమినేట్ అయిపోయింది అనే అర్ధం వచ్చేలా అప్ డేట్ ఇచ్చింది. గతంలో ఆమె ఇచ్చిన లీకులు సహా అనేక లీకులు నిజమైనట్టే ఈ లీకు కూడా హండ్రడె పర్సెంట్ నిజమయ్యే చాన్సే ఉంది.

వాస్తవానికి 13వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి అమిత్ తివారి ఎలిమినేట్ అవుతాడని అందరూ భావించారు. ఈ వారం ఓటింగ్ సరళిని వివిధ ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్సును బట్టి చూస్తే అదే స్పష్టమైంది. ఓటింగ్ స్టార్టయినప్పటి నుంచీ ఇలాగే కొనసాగింది ఓటింగ్. 60 శాతం ఓట్లుతో మొదటి స్థానంలో కౌషల్, 20 శాతం పైబడిన ఓట్లుతో ద్వితీయస్థానంలో దీప్తి నల్లమోతు, చెరో పది శాతం ఓట్లుతో శ్యామల, అమిత్ తివారి ఈ వారం మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఓ దశలో నాలుగో స్థానంలో ఉన్న అమిత్ ఈ వారం ఎలిమినేట్ అవడం పక్కా…అని అంతా భావించారు. కానీ ఈ వారం నామినేషన్ల ప్రక్రియ జరిగినప్పుడు కౌషల్ శ్యామలనే నామినేట్ చేశాడు. దీంతో ఆమె ఎలిమినేషన్ ను బలంగా కౌషల్ కోరుకుంటున్నాడని కౌషల్ ఆర్మీ సహా ఆయన అభిమానులు అంతా భావించారు. పైగా అప్పటికే కౌషల్ ఆర్మీ గురించి ఇంటి సభ్యులందరికీ చెప్పేసి, వారందరితో నూతన్ నాయుడుని ఎలిమినేట్ చేయించింది.

పైగా తాను కౌషల్ ఆర్మీ మద్దతు కూడగట్టుకుని, కౌషల్ కు అండగా నిలుస్తానని చెప్పి రీ ఎంట్రీ ఇచ్చింది. తీరా వారి ఓట్లుతో రీ ఎంట్రీ ఇచ్చి, తాను కౌషల్ కు సాయం చేయలేదు సరికదా. ఇచ్చిన మాటకు కట్టుబడి కౌషల్ కు సపోర్ట్ చేసిన నూతన్ నాయుడు ఎలిమినేషన్ కు కారణమైంది. ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన కౌషల్ ఆర్మీ శ్యామల చేసిన నమ్మకద్రోహం మీద విపరీతమైన కోపంతో రగిలిపోయి వుంది. ఈ నేపథ్యంలో కౌషల్ కూడా ఆమెను నామినేట్ చేయడంతో, శుక్రవారం సాయంత్రం నుంచి కౌషల్ ఫ్యాన్స్ ఓటింగ్ స్ట్రాటజీ మార్చారు. ఎటూ కౌషల్ సేవ్ అయిపోయాడు కనుక, శుక్రవారం సాయంత్రం నుంచి 40 ఓట్లు కౌషల్ కు వేస్తూ, 10 ఓట్లు అమిత్ తివారికి వేశారు. దీంతో నాలుగో ప్లేసులో నుంచి అమిత్ మూడో ప్లేసులోకి వచ్చేశాడు. శ్యామల నాలుగో స్థానంలో నిలిచి ఎలిమినేట్ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -