Wednesday, May 1, 2024
- Advertisement -

వైరస్ నుంచి దూరంగా ఉండాలంటే.. అలా బ్రతకాల్సిందే: పూరి

- Advertisement -

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ ఎంతో భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అయితే భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడి సంతోషకరమైన జీవితాన్ని గడపాలంటే  ‘ఆఫ్‌ ది గ్రిడ్‌ లివింగ్‌’ను అవలంభించాలని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తెలిపారు.

 ‘పూరీ మ్యూజింగ్స్‌’ వేదికగా దర్శకుడు పలు సందేశాత్మక అంశాలతో అందరిని ఆకట్టుకున్నాడు. ముందు ముందు భవిష్యత్తు ఎంతో దారుణంగా ఉండబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆఫ్ ది గ్రిడ్ లివింగ్ ను అలవాటు చేసుకోవాలని దర్శకుడు తెలిపారు.ఆఫ్ ది గ్రిడ్ లివింగ్ అంటే… ప్రస్తుతం ఉన్న ఈ నాగరిక ప్రపంచానికి దూరంగా ఉంటూ ప్రకృతి ఒడిలో జీవనం కొనసాగించడాన్ని” ఆఫ్ ది గ్రిడ్ లివింగ్” అని అంటారు.

Also read:సుల్తాన్ సినిమాలో ఈ రొమాంటిక్ సీన్ ను చూశారా ?

ఎలాంటి ప్రజా వినియోగాలు లేకుండా, గ్యాస్, కరెంట్, ఇంటర్నెట్ లేకుండా ప్రకృతిలో లభించే వాటిని ఉపయోగించుకొని స్వయంగా పంటలు పండించుకుంటూ బ్రతకడానికి “ఆఫ్ ది గ్రిడ్ లివింగ్” అంటారు. పూర్వం మన పెద్ద వారు ఈ విధంగానే బ్రతికేవారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 35మిలియన్ల మంది ఇలా ‘ఆఫ్‌ ది గ్రిడ్‌’ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కనుక ఈ భయంకరమైన వైరస్ నుంచి దూరంగా ఉండాలంటే “ఆఫ్ ది గ్రిడ్ లివింగ్”అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా దర్శకుడు తెలిపారు.

Also read:ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్‌ను గుర్తుపట్టారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -