Thursday, May 9, 2024
- Advertisement -

పాన్ ఇండియా లెవెల్ లింగు సామి తో సినిమా చేస్తున్న రామ్?

- Advertisement -

ఎనర్జిటిక్ హీరో రామ్ వరుసగా మూడు హిట్లతో మంచి ఫాంలో వున్నాడు. ఇక రామ్ కి నార్త్ లోను మంచి క్రేజ్ ఉండటంతో అక్కడ కూడా అతని సినిమాలకి హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా ఫ్యాన్సీ రేటు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ పాన్ ఇండియా సినిమా చెయ్యాలని రామ్ భావిస్తున్నాడని తెలుస్తుంది..

నిజానికి ‘రెడ్’ తరువాత త్రివిక్రమ్,అనిల్ రావిపూడి, ప్రవీణ్ సత్తారు వంటి డైరెక్టర్లతో రామ్ సినిమా ఉంటుందని కథనాలు వినిపించాయి. ఒక్క త్రివిక్రమ్ కి రామ్ ఓకే చెప్పాడు.కానీ ఇంకా టైం పడుతుంది.మిగిలిన ఇద్దరు డైరెక్టర్ల స్క్రిప్ట్ లను హోల్డ్ లో పెట్టాడు. ఫైనల్ గా తమిళ మాస్ దర్శకుడు లింగు స్వామి స్క్రిప్ట్ ను రామ్ ఓకే చేసాడట.

తమిళ్ తో పాటు తెలుగులో కూడా లింగుస్వామి సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ‘రన్’ ‘పందెం కోడి’ ‘ఆవారా’ సినిమాలు మంచి ఘన విజయాలు సాధించాయి…ఇక లింగస్వామీ డైరెక్ట్ చేసిన ‘వెట్టై’ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో ‘తడాకా’ గా రీమేక్ చేస్తే ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. అయితే సూర్యతో చేసిన ‘అంజాన్'(తెలుగులో ‘సికిందర్’) పెద్దగా ఆడలేదు కాని స్టైలిష్ సినిమాగా పాపులర్ అయ్యింది.

అయినప్పటికీ ‘పందెం కోడి2’ ఇక్కడ డీసెంట్ హిట్ అనిపించుకుంది. పైగా ఇతని సినిమాల్లో యాక్షన్ ఎలిమెంట్స్ బాగుంటాయి. మాస్ ఆడియెన్స్ కు కావాల్సిన స్టఫ్ ఉంటుంది. అందుకే లింగుస్వామి డైరెక్షన్లో ఓ పాన్ ఇండియా సినిమా చెయ్యడానికి రామ్ రెడీ అయ్యాడట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం అందుతుంది.

ప్రొడ్యూసర్ గా మారబోతున్న రవి తేజా..!

రాజన్న ఆలయంలో పేరుకు పోయిన నాణేలు.. బ్యాంకు కష్టాలు!

ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం : సీఎం జగన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -