టక్ జగదీష్ వచ్చేది అప్పుడు కాదు.. మేకర్స్ క్లారిటీ..!

- Advertisement -

నాచురల్ స్టార్ నాని హీరోగా, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం టక్ జగదీష్. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా నిన్ను కోరి ఘన విజయం సాధించింది. దీంతో టక్ జగదీష్ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకోగా ఏప్రిల్ 23వ తేదీ విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా విడుదల ఆగిపోయింది.

అయితే జూలై ఆఖర్లో థియేటర్లు మళ్లీ ఓపెన్ చేసే అవకాశం ఉండడంతో ఈ సినిమా కూడా ఈనెలాఖరులో విడుదల చేస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తాజాగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. టక్ జగదీష్ ఈ నెల చివర్లో విడుదల చేస్తున్నట్లు వస్తున్న వార్తలను నమ్మవద్దని ఈ నిర్మాతలు సాహు గారపాటి హరీష్ పెద్ది తెలిపారు. విడుదల తేదీ కన్ఫర్మ్ రాగానే స్వయంగా తామే వెల్లడిస్తామని చెప్పారు.

- Advertisement -

టక్ జగదీష్ సినిమా లో సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టక్ జగదీష్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాని ఈ సినిమా తో పాటు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి.., రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ అనే సినిమాల్లో నటిస్తున్నాడు.

Also Read

బాహుబలిని వెనకేసిన రాకీ బాయ్..!

తాజా రాజకీయాలపై ‘ఆచార్య’ లో పంచ్​లు

చైతూకు నో చెప్పిన బేబమ్మ..! రీజన్​ ఏమిటో?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -