Monday, April 29, 2024
- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ..వారసులొస్తున్నారు!

- Advertisement -

ఏపీ సీఎం జగన్‌ ముందున్న టార్గెట్ ఒక్కటే ‘వైనాట్ 175’. చంద్రబాబు అరెస్ట్ తర్వాత వైసీపీకి కొంత మైలేజీ తగ్గుతుందని భావించినా లేటెస్ట్ సర్వేల్లో జగన్ ప్రభంజనం ఖాయమని తేలిపోయింది. వైసీపీకి ఈ సారి 24 ఎంపీ స్ధానాలు పక్కా అని చెప్పడంతో ఆ పార్టీ శ్రేణుల ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి.

టీడీపీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రజాక్షేత్రంలో ఉండేలా కార్యచరణతో పాటు సీఎం జగన్ సైతం మండలాల పర్యటన చేపట్టే అవకాశం ఉంది. ఏదిఏమైనా రెండోసారి అధికారంలో రావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా కొంతమంది సిట్టింగ్‌లకు సీటు రాదని ఇప్పటికే చెప్పిన జగన్..మరికొన్ని చోట్ల కీలక నేతల వారసులను రంగంలోకి దించనున్నారు.

ఇప్పటికే పలువురు మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేమని తమ వారసులను బరిలోకి దించుతామని ప్రకటించారు. అయితే వీరిలో కొంతమంది నేతల తనయులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా మరికొంతమంది నేతలు బరిలోనే ఉండాలని సూచించారట జగన్. ఇక వారసుల ఎంట్రీలో కన్ఫామ్ అయిన వారిలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడితో పాటు మాజీమంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి,శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, చెన్నకేశవ్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి వారు ఉన్నారు.

అలాగే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా తన కుమార్తెకు, రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ సైతం తన తనయుడికి, స్పీకర్ తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణ ప్రసాద్, పినిపే విశ్వరూప్, తిప్పల నాగిరెడ్డి సైతం తమ వారసుల ఎంట్రీకోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇందులో ధర్మాన కృష్ణ ప్రసాద్ ప్రతిపాదనను జగన్ తిరస్కరించినట్లు సమాచారం. ఈసారే ధర్మాననే బరిలో ఉండాలని సూచించారట. మొత్తంగా వారసుల ఎంట్రీతో వైసీపీలో కొత్త జోష్ నెలకొందని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -