Monday, April 29, 2024
- Advertisement -

ఉత్తమ్ తర్వాత వీరే.. రేవంత్ కు వీళ్లే అడ్డట..

- Advertisement -

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి ఇప్పుడు ముగ్గురు చుట్టూనే పరిభ్రమిస్తోంది. ఏఐసీసీ బాధ్యులు కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ పైనే నమ్మకం ఉంచాడు. రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో అన్ని రాష్ట్రాల పీసీసీ బాధ్యులు రాజీనామా చేశారు. అయితే ఉత్తమ్ మాత్రం అటువైపే చూడలేదు. ఉత్తమ్ రాజీనామా చేస్తే తనే లీడ్ చేసి 2024లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తే సీఎం రేసులో ఉండవచ్చని కోమటిరెడ్డి వెంకటరెడ్డి యోచించినట్టు వార్తలొచ్చాయి. అయితే అది వీలు కాలేదు.

అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ చివరి వరకూ అధ్యక్ష పీఠం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం.. బీజేపీ ని లీడ్ చేద్దామని తనే సీఎం క్యాండిడేట్ అని ప్రయత్నాలు చేశారు. అయితే బీజేపీ నుంచి సానుకూలత వ్యక్తం కాకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ లోనే ఉంటూ సంజాయిషీ ఇచ్చుకున్నారు. తమ్ముడి ద్వారా బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టాలనుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశలు నెరవేరలేదని.. అందుకే కాంగ్రెస్ లోనే ఉంటానని ప్రకటించాడని గుసగుసలు వినిపించాయి.

అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ గనుక బీజేపీలోకి వెళ్లిపోతే మరో సీనియర్ నేత రేవంత్ రెడ్డి పంట పండేది. కేసీఆర్ కు సరైన ప్రత్యర్థిగా విమర్శిస్తూ ముప్పతిప్పలు పెట్టే రేవంత్ ను పీసీసీ చీఫ్ చేయడానికి ఉత్తమ్ కూడా ఒప్పుకునే చాన్స్ ఉండేది. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ మళ్లీ కాంగ్రెస్ కే రావడంతో ఇప్పుడు రేవంత్ ఆశ తీరేలా కనిపించడం లేదు.

ఇప్పుడు కాంగ్రెస్ లోని గ్రూపుల వల్ల ఉత్తమ్ కూడా రేవంత్ కే సపోర్టుగా నిలుస్తున్నాడని సమాచారం. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డు లేకపోతే రేవంత్ కు పగ్గాలు దక్కే అవకాశాలే ఎక్కువ. ఆ సమయం కోసం వేచిచూడడమే ఇప్పుడు రేవంత్ ముందర ఉన్న కర్తవ్యం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -