Monday, April 29, 2024
- Advertisement -

ఆర్ఎస్ఎస్ ను కట్టడి చేయాలనుకొంటున్న అమెరికా?!

- Advertisement -

బారతదేశంలోని మతపరమైన స్వేచ్ఛ గురించి అమెరికన్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన వ్యాఖ్యానాలు చాలా ఓవర్ గా ఉన్నాయి. భారతదేశానికి సంబంధించిన అంతర్గత వ్యవహరాల్లో అమెరికా అనవసరంగా జోక్యం చేసుకొంటున్నట్టుగా ఉంది ఈ కమిటీ ఇచ్చిన నివేదిక. భారత్ లో మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాకా మత స్వేచ్ఛ ప్రశ్నార్థకం అయ్యిందని ఈ కమిటీ చెప్పుకొస్తోంది.

ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని.. భారత్ లో మత స్వేచ్ఛను కాపాడాలని ఈ కమిటీ పిలుపునిచ్చింది. ఈ విషయంలో మరో అడుగు ముందుకేస్తూ.. భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం.. ఈదేశంలోని మత స్వేచ్ఛ మీద దృష్టి సారించాలని అమెరికన్ ప్రభుత్వ కమిటీ అభిప్రాయపడింది.

వీహెచ్ పీ, ఆర్ ఎస్ ఎస్ నేతలు మతోద్రిక్తలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని.. వారి వల్ల మైనారిటీలు ఇబ్బందులు పడుతున్నారని.. అంటూ ఈ కమిటీ ఇంకా ఏవేవో విషయాలను చెప్పుకొచ్చింది. 

అయితే అమెరికా ఇలా భారత ఆంతరింగక వ్యవహారాల్లోజోక్యం చేసుకోవడం సబబు కాదనే చెప్పాలి. ఆదేశంలో అంత గొప్ప పరిస్థితులు ఏమీలేవు. అక్కడ హిందూ దేవాలయాల మీద దాడులు జరగడం కూడా అంతర్జాతీయ సమాజం గమనిస్తోంది. ఇక అక్కడ నల్లజాతివారి పట్ల ఉన్న వివక్ష గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. ఇప్పుడు కూడా ఆ దేశంలో నల్ల జాతి వారు తీవ్రమైన నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో అమెరికన్లను ఇండియన్స్ కు లౌకికవాదాలు చెప్పడానికి రావడాన్ని హాస్యాస్పదం అనాలేమో! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -