Thursday, May 2, 2024
- Advertisement -

చత్తీస్ గఢ్ లో మళ్లీ కాల్పుల మోత.. నక్సలైట్ మృతి..!

- Advertisement -

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మళ్లీ కాల్పుల మోత మోగింది. దంతేవాడ జిల్లా గాధం, జంగంపాల్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టుల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. బిజాపూర్ లో జరుగుతున్న ప్రాజెక్టు పనులను మావోయిస్టులు అడ్డుకున్నారు. నది వద్ద నిర్మస్తున్న వాటర్ ఫిల్టర్ ప్లాంట్ పనులపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

అక్కడున్న పలు వాహనాలకు వారు నిప్పు పెట్టారు. కాగా, ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, నిత్యావసర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ఛత్తీస్‌గడ్‌‌లో నక్సల్స్‌-జవాన్ల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే.

ఈ ఎన్‌కౌంటర్‌లో 24 మంది జవాన్లు మృతి చెందగా.. 31 మందికి గాయాలపాలయ్యారు. ఇక ఒక మావోయిస్టు మృతి చెందగా, మిగిలిన వారి కోసం కూంబింగ్ చేపట్టారు. అదనపు బలగాలు కూడా అక్కడికి చేరుకోవడంతో సమీపంలోని అడవులను జల్లెడ పడుతున్నారు.

హోం క్వారంటైన్‌లోకి ప‌వ‌న్ క‌ల్యాణ్.. కారణం అదేనా?

తెలంగాణలో మాస్క్ లేకుంటే వెయ్యి కట్టాల్సిందే.. ఉత్తర్వులు జారీ!

పవన్ కళ్యాన్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్ : మంత్రి పెద్దిరెడ్డి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -