Sunday, April 28, 2024
- Advertisement -

BREAKING NEWS : ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్

- Advertisement -

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే కరోనా మందు ఎంతో మందికి నయం అవుతుందని నమ్మకంతో వేలాది మంది కృష్ణపట్నం తరలి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆనందయ్య మందు పై వివాదం నెలకొంది. దాంతో మందు పంపిణీ ఆపివేశారు. కరోనాను అరికట్టేందుకు ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద ఔషధంపై ఆయుష్ పరిశోదన చేస్తోంది. ఈ క్రమంలో ఆయుష్ కమిషనర్ రాములు ఆనందయ్య ఔషదంపై సీఎం జగన్మోహన్ రెడ్డికి సోమవారం నివేదికను అందజేశారు. నివేదిక పరిశీలించాక ఆనందయ్య ఔషధం కరోనా కట్టడికి పనికి వస్తుందో, లేదో నిర్ధారిస్తామని స్పష్టం చేశారు.

ఆనందయ్య ఔషధంలో వాడుతున్న మూలికలు ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్నవేనని తెలిపారు. ఇందులో హానికరమైన పదార్థాలేవీ లేవన్నారు. ఆనందయ్య మందుతో ఎలాంటి ప్రమాదం లేదని తేలిన తర్వాతే ప్రజలకు పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు ఆయుష్ కమిషనర్ రాములు నాయక్. మొత్తానికి అన్ని అవరోధాలు దాటి ఎట్టకేలకు ఆనందయ్య మందుకు అనుమతి లభించింది. కరోనా రోగులకు ఆనందయ్య మందు ఇవ్వవచ్చంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆనందయ్య ఇ‍చ్చే పీ, ఎల్‌, ఎఫ్‌ మందులు రోగులు వాడేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది.

సీసీఏఆర్‌ఎస్‌ఏ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కంటిలో వేసే చుక్కుల మందుకు తప్ప మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కంట్లో వేసే చుక్కల మందుకు అనుమతి నిరాకరించింది. ఆనందయ్య మందులు హానికరం కాదని నివేదికలు వచ్చాయి. సిసిఆర్ఎఎస్ ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంట్లో వేసే చుక్కల మందుపై ఇంక క్లారిటీ రావాల్సి ఉంది.

తెలంగాణ ఆడబిడ్డలకు అండగా ఉంటా : వైఎస్ షర్మిల

సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నేడు.. మహేష్ బాబు ఎమోషనల్ ట్విట్!

ఒక్క హిట్ తో బిజీగా మారిన కుర్ర హీరో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -