Monday, April 29, 2024
- Advertisement -

ఆరోగ్య‌శాఖ‌పై జ‌గ‌న్ స‌మీక్ష‌….

- Advertisement -

జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన వెంట‌నె పరిపాల‌న‌పై ప్ర‌త్యేకంగా దృష్టిపెట్టారు. ప్ర‌తీ రోజు తాడేప‌ల్లిలోని ఆయ‌న నివాసంలో శాఖ‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హిస్తూ బిజీగా గ‌డుపుతున్నారు. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ‌పై అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచి మంచి ఫలితాలు సాధించే విధంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వం వైద్యం కూడా అందాలని అధికారులకు సీఎం ఆదేశించనున్నారు.ఇప్పటికే నివేదికలు తయారుచేసిన ఇరుశాఖల అధికారులు వాటిని సీఎంకు సమర్పించనున్నారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పథకాలను రూపొందించాలని ఇప్ప‌టికే జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారుడు అజయ్‌ కల్లాం, వైద్య శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -