Wednesday, May 8, 2024
- Advertisement -

యుద్ధం చేయ‌డానికి సిద్ధం …క‌య్యానికి కాలు దువ్వుతున్న ఉత్త‌ర కొరియా ..

- Advertisement -
Dorald Trump will meet kim jong un under the right circumstances white house

ఉత్త‌ర‌కొరియా…అమెరికా మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధ‌వాతావ‌ర‌ణాన్ని త‌గ్గించ‌డానికి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను ఉత్త‌ర కొరియా లెక్క‌చేయ‌డంలేదు. ఇన్నాల్లు కారాలు మిరియాలు నూరిన ట్రంప్ ఇప్పుడు శాంతి మంత్రాలు ప‌టిస్తున్నారు.

ఇన్నాళ్లూ అమెరికా ఎవరినైతే బద్ధవిరోధిగా భావించిందో, ఆ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌ ఉన్‌తో ట్రంప్‌ భేటీకాబోతున్నట్లు వైట్‌హైస్‌ సంచలన ప్రకటన చేసింది. కొన్ని ష‌ర‌తుల‌ను అంగీక‌రించాల్సి ఉంటుంద‌ని అప్పుడే శాంతి చ‌ర్చ‌లు ఉంటాయ‌ని వైట్‌హౌస్ ప్ర‌క‌టించింది.
ప్ర‌స్తుతం ఇరుదేశాధినేత‌లు క‌లుసుకొనే వాతా వ‌ర‌ణం లేద‌ని….కొరియా తన అణుచర్యలను పూర్తిగా నిలిపేయాలి. దాని చుట్టుపక్కల దేశాలతోపాటు అమెరికాకు ఎలాంటి హాని తలపెట్టబోనని, కవ్వింపు ప్రకటనలు చేయబోని ప్రకటించాలి. అప్పుడే భేటీకి మార్గం సుగమమం అవుతుంది. ఇది జరగడానికి కొంత సమయం పట్టొచ్చు’ అని స్పైసర్‌ చెప్పారు. అయితే ఉత్త‌ర‌కొరియా మాత్రం అందుకు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తిస్తోంది.కిమ్‌ జాంగ్‌తో ట్రంప్‌ భేటీ అవుతారని వైట్‌హౌస్‌ ప్రకటించిన తరుణంలోనే.. ఉత్తరకొరియా మరోమారు కయ్యానికి కాలుదువ్వింది.అణ్వాయుధ పరీక్షల నేపథ్యంలో ఉత్తరకొరియాకు.. అమెరికాకు మధ్య సంబంధాలు అంతగా బాగుండని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా అగ్రరాజ్యాన్ని రెచ్చగొట్టే తరహాలో ఉత్తరకొరియా సవాలు విసిరింది. ఏ క్షణంలో అయినా.. ఏ ప్రాంతంలో అయినా అణ్వాయుధ పరీక్ష నిర్వహిస్తామని వార్నింగ్ ఇచ్చేసింది. దీంతో.. కొరియా ద్వాపంలో ఉద్రిక్తతలు పీక్స్ కు చేరుకున్నాయి.
మిస్సైళ్లు, అణుపరీక్షలు నిలిపేయాలన్న అమెరికా అభ్యర్థనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఈ మేరకు కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన చేసింది. అమెరికా ఆంక్షలకు భయపడి మిస్సైళ్లు, అణుపరీక్షలపై వెనక్కితగ్గే ప్రసక్తే లేదని, రెట్టించిన వేగంతో దూసుకెళతామని స్పష్టం చేసింది. ఉత్తర కొరియాపట్ల విరోధభావనను మార్చుకుంటే తప్ప అమెరికాతో సత్సంబంధాలు నెరపబోమని తేల్చిచెప్పింది.
మరోసారి కానీ పరీక్షలు జరిపితే దాడులు తప్పవంటూ అమెరికా హెచ్చరించింది. అయినప్పటికీ ఉత్తరకొరియా ఇప్పటికి వెనక్కి తగ్గంది లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా కొరియా విదేశాంగ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. దేశ నాయకత్వం నిర్ణయించిన ప్రకారం ఏక్షణంలో అయినా.. ఏ ప్రాంతంలో అయినా అణ్వాయుధ పరీక్షల్ని నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా అమెరికాకు చురుకుపుట్టే మాటల్ని కొరియా విదేశాంగ అధికారప్రతినిధి ప్రస్తావించారు. అమెరికా తన అణ్వస్త్ర విధానాల్ని మానుకునేంతవరకూ తాను అణ్వాయుధ పరీక్షల్ని చేపడతామని పేర్కొనటం కొత్త టెన్షన్కు తెర తీసేలా చేసిందని చెప్పక తప్పదు.

Also Read

  1. ఉత్త‌ర కొరియాకు ట్రంప్ తీవ్ర హెచ్చ‌రిక‌లు
  2. చైనా, పాకిస్థాన్‌తో యుద్ధానికి సిద్ధంగా ఉడండి…
  3. ఏక్ష‌ణ‌మైనా యుధ్దం.. అంత‌ర్జాతీయంగా ఉద్రిక్త ప‌రిస్తితులు
  4. పాకిస్థాన్ చేతిలో చంప‌బ‌డిన అమ‌ర‌జ‌వాన్ కుటుంబాల డిమాండ్‌..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -