Tuesday, April 30, 2024
- Advertisement -

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం… కేబినేట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు

- Advertisement -

రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. తమకు ఏది కరెక్ట్ అనిపిస్తే… నేతలు దాన్ని ఫాలో అవుతుంటారు. తాజాగా సీఎం జ‌గ‌న్ కూడా ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల‌కు అనుగునంగా కేబినేట్ పై త‌న‌దైన ముద్ర వేస్తున్నారు.ఎవరూ ఊహించని స్థాయిలో వైసీపీకి భారీ మెజార్టీ రావడంతో… మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే అంశంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అన్ని సామాజిక స‌మీక‌ర‌ణాల‌ను దృష్టిలో పెట్టుకొని రేపు 25 మందితో కేబినేట్ కొలువు తీర‌నుంది.

వైఎస్ జగన్… ఆశ్చర్యకరమైన నిర్ణయాలతో అంతా అవాక్కయ్యేలా చేశారు. తన కేబినెట్‌లోని ఐదుగురు మంత్రులకు డిప్యూటీ సీఎం ర్యాంక్ ఇవ్వాలని నిర్ణయించుకున్న జగన్… వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు వర్గాలకు ఛాన్స్ ఇవ్వాలని డిసైడయ్యారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడాలేని విధంగా తన కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలకు అవకాశం కల్పించాలని జగన్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

సమావేశంలో పాల్గొన్న నేతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ..ఇక ఆ ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఎవరు? ఏ సామాజికవర్గం నుంచి ఎవరు? ఎవరు డిప్యూటీ సీఎంల రేస్‌లో ఉన్నారు? అనే ఆసక్తి అన్ని వర్గాల్లో నెలకొంది. ఈ కింద పేర్కొన్న ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రి పదవుల రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.

  1. అంజాద్ బాషా, మైనార్టీ
  2. సుచరిత, ఎస్సీ
  3. ఆళ్ల నాని, కాపు
  4. పార్థసారథి, యాదవ
  5. రాజన్నదొర, ఎస్టీ.. డిప్యూటీ సీఎంల రేస్‌లో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -