Monday, April 29, 2024
- Advertisement -

ఇలా చేయడం వల్ల మీకు బ్యాంకు చార్జీలు అసలు ఉండవు

- Advertisement -
How To Avoid Bank Charges

కేంద్ర నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యుడికి చుక్కలు కనిపించాయి. ఈ నోట్ల రద్దు ద్వారా దేశంలో చాలా త‌క్కువ మొత్తంలోనే బ్లాక్‌మ‌నీ బయట పడిందని విమ‌ర్శ‌లు వచ్చాయి. చాలా మంది ఖాతాదారులు నోట్లు మార్చుకునే నెపథ్యంలో కొత్త నోట్లు దొర‌క్క దాదాపు రెండు, మూడు నెలలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడే కాస్త పర్వాలేదు అనుకుంటున్న సమయంలో బ్యాంకులు తీసుకున్న ఇంకో నిర్ణ‌యం వల్ల ప్రజలు మళ్లీ ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తోంది. నోట్ల రద్దు టైంలో ముందు డబ్బులు తీసుకునేందుకు పడిగాపులు కాచిన సామాన్యుడు, ఇప్పుడా ఏటీఎం వైపు వెళ్లాలంటేనే భయపడుతున్నాడు.

బ్యాంకుల్లో డ‌బ్బులు వేసినా..తీసినా చార్జీలు వసూలు చేస్తున్నారన్న నిర్ణ‌య‌మే ఇందుకు కారణం. అయితే వరస చార్జీల‌తో నష్టపోకుండా ఖాతాదారులు త‌ప్పించుకునే ఓ గుడ్ న్యూస్ వ‌చ్చేసింది. అదే ఆధార్ ఆధారిత యాప్ ద్వారా నగదు చెల్లింపులు.

ఆధార్ పే యాప్ ద్వారా నగదు చెల్లింపులపై ఎలాంటి చార్జీలు ఉండవు. ఈ ఆండ్రాయిడ్ ఆధారిత యాప్‌ను ఐడీఎఫ్‌సీ బ్యాంకు ఆవిష్కరించింది. ఈ యాప్ ఖాతాదారుల‌కు ఉంటే చాలు. ఇక డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌లో ఏదీ అవ‌స‌రం లేదు.. దుకాణాదారుడు ఈ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే దాన్ని బ‌యోమెట్రిక్ లేదా ఫింగ‌ర్ ఫ్రింట్ స్కాన‌ర్‌కు క‌నెక్ట్ చేయాలి. వ‌స్తువులే లేదా స‌రుకులు కొనుగోలు చేసే కొనుగోలుదారుడు తన ఆధార్ నంబర్‌ను అందులో నమోదు చేసి, బ్యాంకును సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇక నగదు చెల్లించడమే తరువాయి. ఈ యాప్ ద్వారా చెల్లింపులు జరిపితే ఎలాంటి ట్రాన్షాక్షన్ ఫీజులు ఉండవు. 

Related

  1. ఇక్కడ చెట్లకు డబ్బులు కాస్తాయని మీకు తెలుసా?
  2. హిందూ పురాణాల ప్రకారం వీళ్లు ఇంకా బ్రతికే ఉన్నారు..!!!
  3. వాట్సాప్ సెక్యూరిటీకి అదిరిపోయే.. ఫీచ‌ర్‌ ఇదే!
  4. జియో వల్ల వారికి ఎంత లాభమో తెలిస్తే షాకే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -