Monday, April 29, 2024
- Advertisement -

అఫ్రిదీకి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన మాజీ క్రికెటర్, భాజాపా ఎంపీ గంభీర్..

- Advertisement -

జమ్ముకశ్మీర్ విషయంలో పాక్, భారత్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.అది కాస్తా యుద్దానికి దారి తీసెవిధంగా పాక్ తీరు ఉంది. అంతర్జాతీయంగా ఒటరి అవడంతో ఆ దేశ నేతలు వీలు చిక్కినప్పుడల్లా భారత్ పై విషయం కక్కుతూనె ఉన్నారు. పాక్ క్రికెటర్లు కూడా అప్పడప్పుడూ కాశ్మీర్ పై విమర్శలు చేస్తుంటారు. వారిలో అఫ్రిది ముందుంటారు. అఫ్రీదికి బారత మాజీ క్రికెటర్, బాజాపా ఎంపీ గౌతమ్ గంభీర్ కౌంటర్లు ఇస్తూనె ఉంటారు. తాజాగా అఫ్రిదీ మరో ట్విట్టర్ లో ట్టీట్ చేశారు.

ప్రధాని పిలుపునిచ్చిన కశ్మీర్‌ అవర్‌కు ఒక జాతిగా స్పందించండి. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు నేను మహ్మద్‌ అలీ జిన్నా సమాధి వద్ద ఉంటాను. మన కశ్మీరీ సోదరులకు సంఘీభావం ప్రకటించేందుకు నాతో కలవండి. సెప్టెంబర్‌ 6న నేను అమరవీరుల స్వస్థలం సందర్శిస్తాను. త్వరలోనే నియంత్రణ రేఖ వద్ద పర్యటిస్తాను’ అని అఫ్రిది బుధవారం ట్వీట్‌ చేశాడు. ఆట్వీట్ కు గౌతమ్‌ గంభీర్ ఘాటుగా బదులిచ్చాడు.

‘‘కొంతమంది ఎప్పటికీ ఎదగలేరు. వారు క్రికెట్ ఆడుతారు కానీ ఆలోచించలేరు. వారి మెదడు కూడా ఎప్పటికీ మందకొడిగానే ఉంటుంది’’ అని గంభీర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -