Monday, April 29, 2024
- Advertisement -

ఒక్క చాన్స్ ఇవ్వండంటున్న పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌..

- Advertisement -

పుల్వామా ఉగ్ర‌దాడి త‌ర్వాత భార‌త్‌, పాక్ ల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. మరోసారి దయాది దేశాలు ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నాయి. ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తున్న పాక్‌కు త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు డిమాండ్ ను తెర‌పైకి తెచ్చారు. ప్ర‌ధాని మోదీ కూడా ప్ర‌తీకారం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. ఈ వార్తలతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మొద‌ట ఈ ఘ‌ట‌న‌తో త‌మ‌కు సంబంధం లేదంటూ ముందు బుకాయించిన పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఓమెట్టు దిగి కాళ్ల బేరానికి వ‌చ్చింది. మీరు నిజంగా పఠాన్ బిడ్డైతే… ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న మోదీ విసిరిన సవాల్‌కు స్పందించారు.

అంతర్జాతీయ సమాజం నుంచి ఎదురువుతోన్న ఒత్తిళ్లు లేకా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని భయమో తెలియదు కానీ, పుల్వామా ఉగ్రదాడిలో పాక్‌ ప్రమేయంపై ఆధారాలుంటే ఇవ్వాలని, బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని ఇమ్రాన్ స్పష్టం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామన్నారు ఇమ్రాన్. అయితే దీనికి సంబంధించి పాక్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.ఇరు దేశాల మధ్య శాంతి, సౌభ్రాతృత్వాల కోసం భారత ప్రధాని తనకు ఓ అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -