Thursday, May 2, 2024
- Advertisement -

కొత్త మలుపు.. ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి..

- Advertisement -
rajini into politics but thinking abt that

తమిళనాడు రాజకీయ కొత్త ట్వీస్ట్ వచ్చి చేరింది. తమిళనాడు రాజకీయాలు కొత్త మలుపు తిరిగే అవకాశం జోరుగా కనిపిస్తోంది. ఓ వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీరు సెల్వమా, శశికళా అన్న‌ది సృష్టం లేక త‌మిళ జ‌నాల‌తో పాటు దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఉంది. ఇప్పుడు కోలీవుడ్ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పార్టీ పెట్టబోతున్నాడన్న వార్తలు త‌మిళ మీడియాతో పాటు సోషల్‌ మీడియాలో జోరుగా  హల్ చల్ చేస్తున్నాయి. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లో వస్తారంటూ వార్తలు వస్తున్నాయి.

త్వరలో రజనీకాంత్‌ కొత్త పార్టీ పెడతారంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఆయన కొత్త పార్టీ స్థాపించనున్నారని, ఈ మేరకు మంతనాలు జరుపుతున్నారని, బీజేపీలోకి రజనీని తీసుకువచ్చేందుకు ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త గురుమూర్తిని రంగంలోకి దింపారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే, ఈ వార్తలను నమ్మవద్దని గురుమూర్తి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. రజనీకాంత్‌ రాజకీయాలకి రావాలని కోరుతున్న ర‌జ‌నీ ఫ్యాన్స్ ఆయ‌న కొత్త పార్టీయే పెట్టాల‌ని కోరుతున్నారు. ర‌జ‌నీ వేరే పార్టీల్లోకి వెళ్లేందుకు ఫ్యాన్స్ ఒప్పుకోవ‌డం లేదు. అయితే రజనీకాంత్‌కు బీజేపీ మంచి ఆఫర్‌ ఇచ్చినట్లు ప్రచారం జరిగుతోంది. పాలిటిక్స్‌లోకి ఎంట్రీపై ఊగిసలాడుతున్న రజనీకాంత్‌ని తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రజనీకాంత్‌కు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్‌ చేసిన్టటు సమాచారం. అయితే బీజేపీ ఆఫర్‌పై రజనీ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related

  1. ర‌జ‌నీ 2.0లో యంగ్ టైగర్ పాత్ర ఇదే
  2. క‌బాలి కోసం ర‌జ‌నీ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?
  3. ‘పార్టీ మారను’ అంటూనే జంప్ అవ్వడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న చిరంజీవి..?
  4. చిరంజీవి కంటే బాలకృష్ణే ఫాస్ట్ ..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -