Saturday, April 27, 2024
- Advertisement -

ఒమిక్రాన్ పై తెలంగాణ కీలక నిర్ణయం

- Advertisement -

ప్రపంచాన్ని ఒమిక్రాన్ బయపెడుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. కరోనా మూడో ముప్పు ఎప్పుడైనా రావొచ్చని, రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఇకపై ఇంటి నుంచి బయటకు వస్తే మాస్క్ తప్పనిసరని ప్రభుత్వం తెలిపింది.

మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వారికి 1000 రూపాయల జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు. ఒమిక్రాన్ ఇప్పటివరకు 23 దేశాలకు పాకిందని, ఆఫ్రికా దేశాల నుంచి భారత్‌కు చాలా మంది వచ్చారని వారిలో ఎవ్వరికైనా వైరస్ ఉండే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రజానికం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హైదరాబాద్ నగరంలో జనాభా విచ్చల విడిగా తిరుగుతున్నారని, 90 శాతం మంది మాస్క్ ధరించకుండానే వీధుల్లోకి వస్తున్నారని శ్రీనివాస్ తెలిపారు. ఇకపై అలాంటివి కుదరవన్న ఆయన.. అడుగు బయట పెడేతే మాస్క్ తప్పనిరనన్నారు.

ఉత్తరాంధ్రకు భారీ ముప్పు!

భారత్‌లోకి ఒమైక్రాన్?

గరీబొడి జేబుకు చిల్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -