Wednesday, May 1, 2024
- Advertisement -

ఎన్‌టీఆర్ నైతికి విలువ‌లు,ఆశ‌యాల‌ను మాహానాడు సాక్షిగా పాత‌రేసిన చంద్ర‌బాబు

- Advertisement -
Telugu Desam Party Mahanadu 2017 Review at Visakhapatnam

విశాఖ‌లో జ‌రుగుతున్న మ‌హానాడు సాక్షిగా ఎన్‌టీఆర్ ఆశ‌యాల‌ను తుంగ‌లోకి తొక్కారు.టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గొప్పతనాలు… తెలుగు జాతి ఆత్మగౌరవం అని చంద్ర‌బాబు చొక్కాచించుకొని సెల‌విచ్చారు.

అంతేనా మిగితా నాయ‌కులంతా కూడా లెక్చ‌ర‌ర్లు దంచేశారు.పార్టీ కార్య‌క‌ర్త‌లు,నాయ‌కులంతా పార్టీ సిద్దాంతాలు,నైతికి విలువ‌లు పాటించాల‌ని పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.
అస‌లు విష‌యానికి వ‌స్తే అస‌లు ఇప్పుడు టీడీపీకి నైతికి విలువ‌లు ఉన్నాయా …? వాటిగురించి మాట్లాడే ఆర్హ‌త బాబుకుగాని ….ఆయ‌న బ్యాచ్‌కు గాని ఉందా అంటె ముమ్మాటికి లేద‌నే చెప్ప‌వ‌చ్చు. పార్టీ సిద్దాంతాలు,నైతికి విలువ‌ల‌ను పాతంలో పాతిపెట్టి అనైతిక విలువ‌ల‌ను పాటిస్తున్నారు. స్వ‌ర్గీయ నంద‌మూరి రామారావు ఏ విలువ‌ల‌తో పార్టీని స్తాపించారో ఆవిలువ‌ల‌ను ఇప్పుడు మంట‌గొలుపుతున్నారు.

{loadmodule mod_custom,Side Ad 1}

చంద్ర‌బాబు మాట్లాడుత‌న్న విలువ‌ల గురించి తెలుసుకోవాలంటె ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిస్థితులేంటి. ఇక కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డి హత్య ఫ్యాక్షన్‌ రాజకీయ కోణంలోనే జరిగింది కదా.! ప్రకాశం జిల్లాలో టీడీపీలోనే గొట్టిపాటి రవి – కరణం బలరాం వర్గీయుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు ఇద్దరు వ్యక్తుల ప్రాణాల్ని తీసేసింది కదా.వీటిగురించి ఎవ‌రూ మాట్లాడ‌రు .అస‌లు వాటిని ప్ర‌స్తావించ‌నే కూడ‌దంటారు.
నైతికి విలువ‌ల గురించి మాట్లాడాలంటె ముందుగా స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు గురించి మాట్లాడుకోవాలి. ఏ సిద్దాంతాలు, ఏ నైతికి విలువ‌ల‌తో పార్టీని స్తాపించారో …ఆయ‌న మ‌ర‌ణించేంత వ‌ర‌కు వాటినే ఆచ‌రించి చూపిన మ‌హానుభావుడు.రాజకీయ పార్టీ పెడుతూ ప్రజా ప్రతినిథులు తమ పార్టీలోకి జంప్‌ చేయాలని చూస్తే, వారి పదవులకు రాజీనామా చేయాల్సిందిగా సూచించారు. అలా రాజీనామా చేశాకే, వారిని తన పార్టీలోకి ఆహ్వానించారు. కాని బాబు మాత్రం నైతిక విలువ‌ల‌కు పాత‌రేసి పిరాయింపుల‌ను ప్రోత్స‌హించారు.నిస్సిగ్గుగా మంత్రి ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెట్టారు.

{loadmodule mod_custom,Side Ad 2}

తెలుగు వారి ఆత్మ‌గైర‌వం గురించి మాట్లాడె నైతికి హ‌క్కు బాబు ఎప్పుడో కోల్పోయారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు తాకట్టు పెట్టేశారు.? ప్రత్యేక ప్యాకేజీపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేకపోయినా బీజేపీతో క‌లిసి సంసారం చేస్తున్నారు విశాఖలో ఐటీ రంగం సంగతేంటి.? విశాఖ రైల్వే జోన్‌ మాటేమిటి.? ఇవ‌న్నీ కేంద్రం ద‌గ్గ‌ర తాక‌ట్టు పెట్టి విలువ‌ల గురించి బాబు మాట్లాడ‌టం హ‌స్యాస్ప‌దంగా ఉంది.
మూడు రోజుల మహానాడు పండుగ అంగరంగ వైభవంగా ముగిసింది.బాబు ప్రెస్ మీట్‌కు ..మ‌హానాడుకు తేడాలేదు.మూడురోజులు వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డం త‌ప్ప ఒరిగిందేమిటి. ఇక చంద్రబాబుని ఇంకోసారి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.మ‌రి దీనికి ఇంత హంగామా అవ‌స‌ర‌మా అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. నైతికి విలువ‌ల గురించి మాట్లాడ‌ట‌మంటె ద‌య్యాలు వేదాలు వ‌ల్లించి న‌ట్టుంది బాబుగారి ప్ర‌సంగం.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

{youtube}z4xsB33ftHc{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -