Tuesday, May 7, 2024
- Advertisement -

చంద్రబాబువి భారతంలో ఉత్తరకుమారుడి ప్రగల్భాలు

- Advertisement -
YSRCP Chief YS Jagan Challenges Chandrababu Naidu

అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం తన కార్యాలయంలో  జగన్ మీడియాతో చిట్ చాట్ చేశారు. సభలో తాను మాట్లాడకూడదనే అసెంబ్లీ వాయిదా వేశారని అన్నారు. చంద్రబాబువి భారతంలో ఉత్తరకుమారుడి ప్రగల్భాలని మండిపడ్డారు.

అనంతపురం పట్టభద్రుల స్థానం సహా 4 చోట్ల తామే గెలిచామని జగన్ తెలిపారు. చదువుకున్న వారంతా తమకే ఓట్లు వేశారని ఇవి ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించే ఫలితాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రలోభాలకు పాల్పడ్డారని కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడంతో పాటుగా ప్రజా ప్రతినిధులను భయబ్రాంతులకు గురిచేశారని జగన్ తెలిపారు.

చంద్రబాబుకు మరోసారి సవాల్ చేస్తున్నా. దమ్ముంటే ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట ఎన్నికలకు రావాలి, ప్రత్యేక హోదా కోసం జూన్ వరకు వేచి చూస్తాం. లేకుంటే మా ఎంపీలతో రాజీనామా చేయిస్తామని ప్రకటించారు. దేశం మొత్తం ఏపీవైపు చూసేలా చేస్తామని జగన్ స్పష్టం చేశారు. ప్రాజెక్టులపై చంద్రబాబు మాటలన్నీ అబద్ధాలేనని జగన్ మండిపడ్డారు. 80 శాతం ప్రాజెక్ట్ ల పనులు చంద్రబాబు రాకముందే పూర్తయ్యాయని గుర్తు చేశారు. మిగతా 20 శాతం పనులను కూడా బాబు పూర్తి చేయలేదని అన్నారు.

గండికోట,చిత్రావతి, పోతిరెడ్డిపాడు సహా ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదని పేర్కొంటూ మూడేళ్లైనా చంద్రబాబుకు ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ధ్యాస లేదని జగన్ మండిపడ్డారు. శ్రీశైలంలో నీళ్లున్నా రాయలసీమకు ఇవ్వలేదు అలాంటి మనిషి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులిచింతల ప్రాజెక్ట్ బాబు సీఎం అయ్యేనాటికే పూర్తి అయిందని పేర్కొంటూ ఇప్పటివరకు నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదని జగన్ తప్పుపట్టారు.

Related

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -